SSMB29: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “గుంటూరు కారం”. ఆగస్టు 9వ తారీకు మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి కొత్త అప్ డేట్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో ఫ్యాన్స్ ఫుల్ ఆనందంగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన చిన్నపాటి గ్లింప్స్ వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టార్ట్ అయ్యాక చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. సినిమా ప్రారంభంలోనే మహేష్ తల్లి మరణించడం తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణించడంతో చాలాకాలం షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే అంత సెట్ అయ్యాక ఉన్నట్టుండి సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్ర చేస్తున్న పూజ హెగ్డే హఠాత్తుగా మధ్యలోనే వెళ్లిపోవడం జరిగింది అని టాక్.
ఇప్పుడు ఆమె ప్లేసులో మీనాక్షి దీక్షిత్ నటిస్తూ ఉందట. కాగా ఇప్పుడు మరో మార్పు చోటు చేసుకున్నట్లు సరికొత్త వార్త వైరల్ అవుతుంది. విషయంలోకి వెళ్తే ఈ సినిమాకి పనిచేస్తున్న సినిమా ఆటోగ్రాఫర్ కూడా ప్రాజెక్టు మధ్యలోనే వైదొలిగినట్లు టాక్. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో చిత్ర బృందం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంసకు బాధ్యతలు అప్పజెప్పడం జరిగిందట. మనోజ్ పరమహంస.. ఎన్నో భారీ ప్రాజెక్టులకు పని చేయడం జరిగింది. ప్రభాస్ నటించిన “రాధేశ్యామ్” కి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఇక ఇదే తరుణంలో విజయ్ జోసెఫ్ నటించిన తమిళ చిత్రం “బీస్ట్” ఇంకా ప్రస్తుతం విజయ్ కొత్త సినిమా “ధ్రువ నచ్చతీరం” సినిమాలకు కూడా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో ఇప్పుడు వినోద్ స్థానంలో మనోజ్ పరమహంసకు “గుంటూరు కారం” సినిమాటోగ్రాఫర్ బాధ్యతలు చిత్ర బంధం అప్ప చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. ఈ వార్త కి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ఈ నెల మూడో వారంలో మొదలుకానుందట. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల నటిస్తుంది. ఇదిలా ఉంటే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఇప్పటివరకు రెండు సినిమాలు చేశారు. అతడు, ఖలేజా.. ఈ రెండు సినిమాలలో కూడా మహేష్ నీ త్రివిక్రమ్ చాలా కొత్తగా చూపించారు. దీంతో ఇప్పుడు గుంటూరు కారం సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకోవడం జరిగింది.