యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా తీయడం చాల సులువైన పని అని అందరు దర్శకులు చెపుతారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో RRR నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు సంబంధించి తాజాగా ఓక వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఇంతకు ముందు వీరి కాంబినేషన్లో అరవింద సమెత రాగా అది బాక్స్ వద్ద మంచి కలెక్షన్లు సాధించింది. మళ్ళీ మూడేళ్ళ తరువాత వీరిద్దరి కంబినేషన్లో మళ్లీ సినిమా రాబోతుంది.
తాజాగా ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోయే సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ చాల వరకు పూర్తైనట్టు సమాచారం. స్క్రిప్ట్ కు సంబందించిన విషయాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రానికి సంబంధించి మొదట ‘అయినను పోవాలి హస్తినకు’ అనే టైటిల్ వైరల్ కాగా, తాజాగా ‘రాజా వచ్చినాడు’ అనే టైటిల్ గురించి బి టౌన్ వర్గాలు చర్చించుకుంటున్నారు.సెంటిమెంట్ ను పక్కనపెట్టి సినిమా ఈ టైటిల్ గురించి చర్చిస్తుంన్నాడు మాటల మాంత్రికుడు.
RRR చిత్ర అనంతరం ఎన్టీఆర్ ఈ సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్రివిక్రమ్ సినిమాలు ఈ మద్య కాలంలో అ అక్షరంతో వచ్చిన అల వైకుంఠపురంలో, అరవిందసమేత, అఆ, అత్తారింటికి దారేది, చిత్రాలు భారీ విజయాలను అందుకోగా ఒక్క అజ్ఞాతవాసి మాత్రమే ఆశించిన మేర ఫలితం రాలేదు. అలాంటి ‘అ’ సెంటిమెంట్ వదిలేసి ఎన్టీఆర్ చిత్రానికి వేరే టైటిల్ వైరల్ అవుతుంది. ఏది ఏమైనా ఈ చిత్ర టైటిల్ కు సంబంధించి ఆఫిషియల్ ప్రకటక వచ్చేవరకు ఆగాల్సిందే. ఎన్టీఆర్ ఈ చిత్ర అనంతరం యువ దర్శకుడు శైలేష్ కొలను చెప్పిన కథకు కూడా అంగీకారం చెప్పి స్క్రిప్ట్ రెడీ చేయమన్నట్టు సమాచారం.