తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చాలామంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ పేరందిన హీరోలు.. పెళ్లి చేసుకుంటున్నారు. ఇటీవల హీరో శర్వానంద్ పెళ్లి అయింది. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ లో పెళ్లి చేసుకుని హైదరాబాద్ లో రిసెప్షన్ నిర్వహించటం జరిగింది. అంతకుముందు కుర్ర హీరో నాగశౌర్య పెళ్లి జరిగింది. బెంగళూరులో పెళ్లి జరగగా.. హైదరాబాదులో రిసెప్షన్ నిర్వహించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఇదే బాటలోకి ఎనర్జిటిక్ స్టార్ హీరో రామ్ పోతినేని కూడా జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరిలో రామ్ పెళ్లి జరగనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో పాన్ ఇండియా నేపథ్యంలో రామ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నవంబర్ కి కంప్లీట్ కానుంది. ఆ తర్వాత డిసెంబర్ నెలలో రామ్ పెళ్లి జరగనున్నట్లు సమాచారం. పెళ్లికూతురు హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురని టాక్. అంతేకాదు ఆమె కూడా వ్యాపార రంగంలో రాణించిన యంగ్ బిజినెస్ ఒమేన్ అని అంటున్నారు. 2006వ సంవత్సరంలో “దేవదాసు” సినిమాతో రామ్ పోతినేని హీరోగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వైవిఆర్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. మొదటి సినిమాతోనే రామ్ బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత అనేక ప్రేమ కథ నేపథ్యంలో అనేక సినిమాలు చేసి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది.
అప్పట్లో రామ్ చాలావరకు ప్రేమ కథ సినిమాలు చేయటంతో… చాలామంది అమ్మాయిలకు నచ్చే హీరోగా పేరు సంపాదించాడు. అయితే మధ్యలో మాస్ ఇమేజ్ సంపాదించడానికి రామ్ చేసిన కొన్ని ప్రయోగాలు అతని కెరియర్ నీ డేంజర్ జోన్ లో పడేసేటట్టు చేశాయి. ఈ క్రమంలో వరుస పరాజయాలు పలకరించటంతో ఒకానొక దశలో రామ్ కెరియర్ ముగిసిపోయినట్లే.. ఇండస్ట్రీ నుండి దుకాణం సర్దేసినట్లే అనే టాక్ కూడా వచ్చింది. అలాంటి సమయంలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించిన “ఇస్మార్ట్ శంకర్” సినిమా మళ్లీ రామ్ కెరియర్ ని పుంజుకునేలా చేసింది. ఈ సినిమాతో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా మళ్లీ నిలదొక్కుకున్నాడు. ఇలా ఉంటే మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో మరో ప్రాజెక్టు ఇప్పుడు లైన్ లో ఉంది. ఈ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వకముందు రామ్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.