Pushpa Movie : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి ఈ సినిమా చేస్తున్న నేపథ్యంలో పుష్ప పై భారీ అంచనాలు ఉన్నాయి. అలా వైకుంఠపురం తో అల్లు అర్జున్ మరోపక్క రంగస్థలం బ్లాక్ బస్టర్ తో సుకుమార్ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పాన్ ఇండియా తరహాలో తెరకెక్కుతున్న పుష్ప పై బన్నీ ఫాన్స్ భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది.
ఇదిలాఉంటే ఇటీవల ఈ సినిమాలో అల్లు అర్జున్ తో పాటు మంచు మనోజ్ కూడా నటిస్తున్నట్లు వార్తలు రావటం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా సినిమాలో హీరోయిన్ రష్మిక మందన కాకుండా మరో హీరోయిన్ కూడా నటిస్తున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల లో వైరల్ అవుతుంది. పూర్తి మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో బన్నీ సోదరి పాత్రకి మొదటిలో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తీసుకోవాలనే ఆలోచనలో సినిమా యూనిట్లు ఉండగా తాజాగా మరో హీరోయిన్ మేఘా ఆకాశ్ అయితే కరెక్ట్ గా సూట్ అవుతుందని ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు అంతా ఓకే అయినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు సమాచారం. ఇలా ఉంటే సినిమాలో విలక్షణ నటుడు జగపతిబాబు కీలకపాత్ర చేస్తున్నట్లు సమాచారం. ఆగస్టు 13వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్టు డేట్ చెప్పేయడంతో షూటింగ్ చాలా స్పీడ్ అందుకుంది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!