Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా “భోళా శంకర్” ఆగస్టు 11వ తారీకు విడుదల కాబోతోంది. ఆదివారం ఈ సినిమాకి సంబంధించి హైదరాబాదులో అభిమానుల మధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మోతేక్కింది. ఈ వేడుకలో కీర్తి సురేష్, తమన్నా ఇద్దరూ బాగా ఆకట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి సంబంధించిన ఒక విషయాలు తెలియజేస్తూ కచ్చితంగా ఇది అందరికీ నచ్చే సినిమా అని అన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తూ.. చిరంజీవి మేనరిజం చూపించటం అన్నిటికి మించి హైలెట్. ఈ వేడుకలో ఎవరికి వారు మాట్లాడుతూ కచ్చితంగా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని తెలియజేశారు.
ప్రస్తుతం ఈ సినిమా విడుదల అవటానికి ఇంకా మూడు రోజులు మాత్రమే టైమ్ ఉండటంతో.. వరుస పెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే నేడు ఈ సినిమా నుండి తీనుమారు అనే సాంగ్ రిలీజ్ కావడం జరిగింది. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పై అభిమానులు బారి అంచనాలు పెట్టుకున్నారు. గత ఏడాది “గాడ్ ఫాదర్”.. ఈ ఏడాది ప్రారంభంలో “వాల్తేరు వీరయ్య” సినిమాలతో రెండు విజయాలు అందుకున్న చిరంజీవి “భోళా శంకర్”తో హ్యాట్రిక్ విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తమిళంలో “వేదాలం” సినిమాకి రీమేక్ గా “భోళా శంకర్” తెరకెక్కింది.
ప్రధానంగా అన్నా చెల్లెల సెంటిమెంట్ తో ఈ సినిమా లైన్ కావడంతో తెలుగులో కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరిగింది. సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించింది. ఈ క్రమంలో ప్రమోషన్ కార్యక్రమాలలో కీర్తి సురేష్ తో చేసిన సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా ఉంటాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. కచ్చితంగా ఈ సినిమా విజయం సాధిస్తుందని అంతగా సీన్స్.. తామద్దరి మధ్య పండాయని తెలిపారు. డైరెక్టర్ మెహర్ రమేష్ హిట్టు కొట్టి చాలాకాలం కావడంతో.. ఈ సినిమా ఫలితం పై అభిమానులు కాస్త టెన్షన్ పడుతున్నారు. కానీ సినిమా యూనిట్ మాత్రం కచ్చితంగా విజయం సాధిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ అభిమానిగా ఇంకా డ్రైవర్ లుక్కులో చిరంజీవి కనిపించబోతున్నారు.