Kalaavathi Song: సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” లో ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన కళావతి సాంగ్ అందరినీ ఆకట్టుకోవడం తెలిసిందే. రిలీజ్ అయిన నాటి నుండి దాదాపు వారం రోజులపాటు యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ గా నిలిచింది. దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో సైతం కళావతి సాంగ్ ట్రెండింగ్ గా కొనసాగడం విశేషం. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా కళావతి పాట మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
విషయంలోకి వెళితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన సాంగ్ గా అత్యంత వేగంగా గా 100K.. ఫాస్టెస్ట్ మిలియన్ లైకులు సాధించిన పాటగా నిలవటం మాత్రమే కాదు 100 మిలియన్ వ్యూస్ సాధించిన పాటగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఇదే తరుణంలో మొన్న రిలీజ్ అయిన పెన్నీ సాంగ్ కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ముఖ్యంగా రెండో సాంగ్ లో మహేష్ కూతురు సితార ఉండటంతో పాటు ఎనర్జిటిక్ గా అదిరిపోయే స్టెప్పులు చిన్న వయసులోనే వేయటంతో..పెన్నీ సాంగ్ కి సోషల్ మీడియాలో జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
ప్రస్తుతం “సర్కారు వారి పాట” సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అనుకున్న టయానికి మే 12వ తారీకు రిలీజ్ చేయాలని దానికంటే ముందు ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేయాలని… మేకర్స్ డిసైడ్ అవుతున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క కరోనా కేసులు జూన్ లో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు రావడంతో.. “సర్కారు వారి పాట” టీం రిలీజ్ విషయంలో కొద్దిగా ఆలోచన చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్. “సర్కారు వారి పాట” అయిన వెంటనే మహేష్ త్రివిక్రమ్ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు.