RRR: ది గ్రేట్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో “RRR” దొరకటంతో ఈ సినిమా రిలీజ్ కోసం భారత దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. “RRR” ప్రారంభమైన నాటి నుండి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. సినిమా ప్రారంభించిన టైంలో 2020 జూన్ మాసంలో విడుదల చేయాలని … తేదీ కూడా ప్రకటించి సినిమా స్టార్ట్ చేయగా… చరణ్, తారక్ ఇద్దరు షూటింగ్ లో గాయపడ్డ టంతో రెండు నెలలు షూటింగ్ ఆగిపోయింది.
ఆ తర్వాత తారక్ కి సంబంధించిన హీరోయిన్ విషయంలో చాలా టైం పట్టింది. అంతా బాగుంది సినిమా షూటింగ్ సజావుగా సాగుతున్న సమయంలో మహమ్మారి కరోనా రావటంతో వేసుకున్న లెక్కల మొత్తం తారుమారయ్యాయి. దీంతో సినిమా అనేకసార్లు విడుదల తేదీ ప్రకటించి వాయిదా పడటం జరిగింది. అయితే చివరాఖరికి జనవరి 7వ తారీకు ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని సినిమా ప్రమోషన్ లో కూడా స్టార్ట్ చేసేసి…”RRR” థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. సినిమా ట్రైలర్ చూసి గ్యారెంటీగా బాహుబలి రికార్డులు పగలగొట్టడం జరుగుతుందని అందరూ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెంచేసుకున్నారు.
అయితే ఇంతలోనే ఒమిక్రన్ రూపంలో వైరస్ కేసును మళ్లీ పుంజుకోవడంతో సినిమా జనవరి 7వ తారీకు రిలీజ్ కావాల్సింది వాయిదా పడింది. అయితే ప్రస్తుతం మార్చి 25 వ తారీకు సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఇటువంటి తరుణంలో ఈ సినిమాకి సంబంధించి మరో థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయాలని రాజమౌళి సరికొత్త ప్లాన్ వేయటం జరిగిందట. సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక బాలీవుడ్ అదేవిధంగా మలయాళం, తమిళం లో జరిగిన క్రమంలో తెలుగు లో జరగబోయే ప్రీ రిలీజ్ వేడుక సమయంలో…ఈ కొత్త “RRR” థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.