NewsOrbit
Entertainment News సినిమా

Adipurush: “ఆదిపురుష్” నుండి మరో సర్ప్రైజ్ సెకండ్ ట్రైలర్..??

Advertisements
Share

Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మొట్టమొదటిసారిగా తెలుగు ఇండస్ట్రీ దర్శకుడు కాకుండా ఇతర ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఈ సినిమా చేయడం జరిగింది. రామాయణం నేపథ్యంలో జరుగుతున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్ నటించాడు. సీత పాత్రలో కృతి సన్నన్ నటించడం జరిగింది. లక్ష్మణుడిగా సన్నీ సింగ్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించడం జరిగింది. జూన్ 16వ తారీకు తెలుగుతోపాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది.

Advertisements

Adipurush: Teaser No. 2 To Be Released On Prabhas' Birthday As An Answer To  Brutal Trolls & Criticism?

ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులు వెయి కళ్ళతో “ఆదిపురుష్” కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకోవటంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. దీంతో ఇప్పుడు ప్రేక్షకులను మరింత సర్ప్రైజ్ చేయడానికి సినిమా యూనిట్ సెకండ్ ట్రైలర్ ప్లాన్ చేసినట్లు సమాచారం. సరిగ్గా ఈ టైలర్ రిలీజ్ కి కొన్ని రోజుల ముందు విడుదల చేయాలని ప్లాన్ చేయటం జరిగిందట. ఈ ట్రైలర్ లో విజువల్ ఎఫెక్ట్స్ మరియు గ్రాఫిక్స్ ఓ రేంజ్ లో చూపించబోతున్నట్లు వినికిడి.

Advertisements

Another surprise second trailer from Adipurush

ఎందుకంటే అంతకు ముందు విడుదలైన ట్రైలర్ ఆల్రెడీ గత ఏడాది విడుదల చేసిన ట్రైలర్ కావడంతో… దానికి కొత్తగా మార్పులు చేర్పులు మాత్రమే చేయటంతో సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం “ఆదిపురుష్” సెకండ్ ట్రైలర్ కి సంబంధించి పనులు శరవేగంగా జరుగుతున్నట్లు త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9వ తారీకు తిరుపతిలో జరగనున్నట్లు సమాచారం. ఈ వేడుకను అత్యంత అంగరంగ వైభవంగా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share
Advertisements

Related posts

Kriti Shetty Latest Stills

Gallery Desk

Rashmi Gautam New HD Stills

Gallery Desk

Rashmika Mandanna: ర‌ష్మిక‌ను టార్చర్ పెట్టిన వ్య‌క్తి.. రివేంజ్ తీర్చుకోలేక‌పోయానంటూ ఆవేద‌న‌!

kavya N