Senior Heroine Jamuna: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వరుస విషాద సంఘటనలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. చాలామంది దిగ్గజా ప్రముఖ నటీనటులు మరణిస్తూ ఉన్నారు. గత ఏడాది రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ, కైకాల సత్యనారాయణ, చలపతిరావు వంటి దిగ్గజ నటీనటులు మరణించడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఈరోజు సీనియర్ హీరోయిన్ జమున మరణించడం జరిగింది. 86 సంవత్సరాల వయసు కలిగిన జమున… పలు అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లో సొంత నివాసంలోనే తుది శ్వాస విడిచారు. జమున మరణ వార్త ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. అయితే జమున మరణించిన కొద్ది గంటల్లోనే మరో విషాదం చోటుచేసుకుంది.

పూర్తి విషయంలోకి వెళ్తే తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాసమూర్తి శుక్రవారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో మరణించారు. ఎన్నో డబ్బింగ్ చిత్రాలతో… తన అద్భుతమైన స్వరంతో ఆవేశపూరిత డైలాగులు చెబుతూ చిత్రా పరిశ్రమలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు సూర్య, అజిత్, విక్రమ్.. ఇంకా మలయాళం ఇండస్ట్రీకి చెందిన మోహన్ లాల్ వంటి హీరోల తెలుగు డబ్బింగ్ సినిమాలకు స్వరం కూడా అందించడం జరిగింది. దాదాపు తమిళ టాప్ మోస్ట్ హీరోల తెలుగు డబ్ సినిమాలకు శ్రీనివాసమూర్తియే గొంతు అందించడం జరిగింది. అటువంటి వాయిస్ కలిగిన ఆర్టిస్ట్ మరణించడంతో తెలుగు సినిమా రంగంలో మరియు తమిళ సినిమా రంగంలో ఈ వార్త విషాదంగా మారింది. శుక్రవారం ఉదయమే చెన్నైలోని స్వగృహంలోనే శ్రీనివాసమూర్తి గుండెపోటుతో కన్నుమూశారు. సూర్య నటించిన “సింగం”, విక్రమ్ నటించిన “అపరిచితుడు”, మోహన్ లాల్ నటించిన “జనతా గ్యారేజ్”.. వంటి హిట్ సినిమాలకు డబ్బింగ్ చెప్పడం జరిగింది.

అంతేకాదు సీనియర్ హీరో రాజశేఖర్ సినిమాలకు కూడా శ్రీనివాసమూర్తి డబ్బింగ్ చెప్పడం జరిగింది. దాదాపు 1000 కి పైగా చిత్రాలకు శ్రీనివాసమూర్తి డబ్బింగ్ తెలియజేశారు. 1998లో రాజశేఖర్ నటించిన “శివయ్య” సినిమాకు ఉత్తమ మెయిల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు గెలుచుకున్నారు. దక్షిణాది సినిమా రంగంలో మాత్రమే కాదు హాలీవుడ్ మరియు బాలీవుడ్ సినిమాలకు కూడా తన స్వరాన్ని అందించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోలు షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్…ల సినిమాలకి కూడా డబ్బింగ్ చెప్పడం జరిగింది. దీంతో ఎంతో గొప్ప డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస్ మూర్తి మరణం పట్ల తెలుగు మరియు తమిళ ఇండస్ట్రీల ప్రముఖలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.