K Viswanath: కళాతపస్వి కె. విశ్వనాధ్ ఫిబ్రవరి రెండవ తారీకు గురువారం అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 92 సంవత్సరాల వయసు కలిగిన విశ్వనాథ్ గత కొంతకాలంగా అనేక అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఆరోగ్యం మరింతగా క్షీణించటంతో… అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. విశ్వనాధ్ మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. చాలామంది దిగ్గజ నటీనటుల మరణ వార్తలతో గత కొద్ది నెలల నుండి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉక్కిరిబిక్కిరి అవుతుంది.
గత ఏడాది సెప్టెంబర్ నెలలో కృష్ణంరాజు నవంబర్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ ఆ తర్వాత కైకాల సత్యనారాయణ, చలపతిరావు మరణించారు. ఇక ఈ ఏడాది జనవరి నెలలో కొద్ది రోజుల క్రితం సీనియర్ హీరోయిన్ జమున మరణించడం జరిగింది. అయితే ఈలోపే ఫిబ్రవరి 2వ తారీఖు సీనియర్ దర్శకులు కళాతపస్వి కే.విశ్వనాథ్ మరణించడంతో ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు సంతాపం వ్యక్తం. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను ప్రతిబింబించే రీతిలో అనేక సినిమాలను కె విశ్వనాథ్ రూపొందించడం జరిగింది. ఆ సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఎంతో పేరు రావడం జరిగింది. శంకరాభరణం, సాగర సంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతిముత్యం, స్వాతికిరణం, స్వయంకృషి, సప్తపది, శుభోదయం, శుభలేఖ, ఆపద్బాంధవుడు, శుభసంకల్పం వంటి సినిమాలు ఆయనకు ఎంతగానో మంచి పేరును తీసుకొచ్చాయి. దర్శకుడిగా దాదాపు 50కి పైగానే సినిమాలు చేశారు.
ఆ తర్వాత నటుడిగా అనేక పెద్ద సినిమాలలో నటించడం జరిగింది. బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు, వెంకటేష్ నటించిన కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, చిరంజీవి నటించిన ఠాగూర్, మహేష్ నటించిన అతడు, ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్.. వంటి పెద్ద పెద్ద సినిమాలలో కీలకమైన పాత్రలు పోషించారు. 1992వ సంవత్సరంలో రఘుపతి వెంకయ్య పురస్కారంతో పాటు పద్మశ్రీ పురస్కారం కూడా అందుకున్నారు. 2016వ సంవత్సరంలో దాదే సాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వరించింది. ఈ క్రమంలో 92 సంవత్సరాలు రావడంతో వయసు రిత్యా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న కే.విశ్వనాథ్.. గురువారం అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. కే.విశ్వనాధ్ మరణం పట్ల ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.