న్యూస్ సినిమా

Acharya: మెగా మల్టీస్టారర్ నుంచి మరో ట్రైలర్..ఎందుకంటే…!

Share

Acharya: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న మెగా మల్టీస్టారర్ ఆచార్య. మెగా అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 29న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటించారు. చిరంజీవికి జంటగా చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. ఇక చరణ్ సరసన పూజా హెగ్డే కీలక పాత్రలో
కనిపించింది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీమతి సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ కలిసి నిర్మించాయి.

another trailer is going to be released from acharya
another trailer is going to be released from acharya

కాగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గరపడటంతో చిత్రబృందం తాజాగా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. దీనిలో భాగంగా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మాస్ అండ్ పవర్ ఫుల్ డైలాగులతో చిరు – చరణ్ తాజా ట్రైలర్‌లో అదరగొట్టారు. అయితే, అందరూ ఈ సినిమాలో మేయిన్ హీరో చిరంజీవి అయితే, ఆయన పాత్రను మరీ కామియో చేసేసినట్టున్నారే అంటూ ట్రైలర్ రిలీజైయాక కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Acharya: ఈ ట్రైలర్ అయినా అంచనాలను పెంచుతుందా..?

అంతేకాదు, ఇంకా బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ మేనియా తగ్గకపోవడంతో నార్త్ మార్కెట్ మీద ఆశతో అక్కడ వసూళ్ళు ఇంకా రాబట్టాలనే ఆలోచనతో ట్రైలర్ ఎంట్రీ చరణ్‌తో మొదలుపెట్టా రని.. చిరు ప్లేస్‌ను చరణ్ ఆక్రమించేశాడని కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఇందులో ఎమోషనల్ కంటెంట్ ఏదీ కనిపించలేదని..కొరటాల గత సినిమాల రేంజ్‌లో అచార్య ఉండబోతుందా అంటూ కొత్త సందేహాలు మొదలయ్యాయి. దాంతో చిత్రబృందం ఈ నెల 24న నిర్వహించబోయో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రెండవ ట్రైలర్‌ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ట్రైలర్ అయినా అంచనాలను పెంచుతుందా లేదా చూడాలి.


Share

Related posts

Pawan kalyan: పవన్ కళ్యాణ్ కి ఆల్రెడీ రాజమౌళి స్టోరీ వినిపించడం జరిగిందట.. ఆ సినిమా ఏంటో తెలుసా..??

sekhar

ఇద్దరు ఏపి ఎంపిలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ

Special Bureau

పసిడి ధర అనుకూలం… దూసుకెళ్తున్న వెండి ధర

bharani jella