Adipurush: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన “ఆదిపురుష్” జూన్ 16వ తారీకు విడుదల కానున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాకి సంబంధించి ఒక్కో సాంగ్..ఫోటో .. సినిమా యూనిట్ విడుదల చేస్తూ ఉంది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి టీజర్ గత ఏడాది అక్టోబర్ నెలలో విడుదలయ్యింది. అయితే గ్రాఫిక్స్ వర్క్ చాలా దారుణంగా ఉండటంతో… మళ్లీ రీ డిజైన్ చేయడం జరిగింది. వాస్తవానికి “ఆదిపురుష్” జనవరి నెలలో విడుదల కావాల్సిన సినిమా. గ్రాఫిక్స్ విజువల్ వర్క్ పట్ల నెగిటివిటీ రావటంతో పాటు భయంకరంగా ట్రోలింగ్ జరగటంతో… ఇప్పుడు హై క్వాలిటీతో జూన్ నెలలో విడుదల చేస్తూ ఉన్నారు.
రామాయణం నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రాముడి పాత్రలో ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించడం జరిగింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు. ఇదిలా ఉంటే గత శనివారం ఏప్రిల్ 22వ తేదీన జైశ్రీరామ్ అనే మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తెలిసిందే. కాగా నేడు “ఆదిపురుష్” నుండి మరో అప్ డేట్ ఇవ్వడం జరిగింది. “జై సీతారాం..” అంటూ సాగే పాటతో సీత పాత్ర పోషించిన కృతి సన్నన్ మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేయడం జరిగింది. గత శనివారం రిలీజ్ అయిన “జైశ్రీరామ్” మోషన్ పోస్టర్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ రావడం జరిగింది. ఏది ఏమైనా సరిగ్గా విడుదలకి నెల రోజులు ముందుగానే “ఆదిపురుష్” ప్రమోషన్ కార్యక్రమలు స్టార్ట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ గా మారిన తర్వాత ప్రభాస్ కి ఇప్పటివరకు ఒక్క హిట్ పడలేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ “ఆదిపురుష్” పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. చాలా వరకు గ్రాఫిక్స్ పైన్నే ఈ సినిమా… భవిష్యత్ ఆధారపడి ఉంది. దీంతో మొదటిసారి ఆల్మోస్ట్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఇప్పుడు.. ఆరు నెలలుగా గ్యాప్ తీసుకుని రిలీజ్ చేస్తున్నారు. మరి “ఆదిపురుష్” తో ప్రభాస్ ఎటువంటి విజయం అందుకుంటాడో చూడాలి.
सीता राम चरित अति पावन
The righteous saga of Siya Ram
Jai Siya Ram
जय सिया राम
జై సీతారాం
ஜெய் சீதா ராம்
ಜೈ ಸೀತಾ ರಾಮ್
ജയ് സീതാ റാം#Adipurush #SitaNavmi #Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #Pramod #Vamsi #KrishanKumar @vfxwaala @rajeshnair06 pic.twitter.com/e3iUXKsuxh— UV Creations (@UV_Creations) April 29, 2023