NewsOrbit
Entertainment News సినిమా

BRO: పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ “BRO” నుండి మరో అప్ డేట్ వచ్చేసింది..!!

Share

BRO: ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలసి “బ్రో” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ్ మూవీ “వినోదయ సీతం”కి రీమేక్ గా వస్తున్న ఈ సినిమానీ సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ఇదే సినిమా తమిళంలో సముద్రఖని నటించడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర సగం మాత్రమే కనిపించిన గాని చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేయడం జరిగిందంట. ఆల్రెడీ పవన్ కి సంబంధించి సీన్స్ మొత్తం షూట్ చేయడం జరిగింది. కొద్దిపాటి బ్యాలెన్స్ షూటింగ్ మాత్రం మిగిలి ఉంది. ఈ సినిమాని జులై నెలలో విడుదల చేయబోతున్నారు.

Another update from Pawan Kalyan Sai Dharam Tej BRO

ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు “బ్రో” టైటిల్ రివిల్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం తెలిసిందే. ఈ పోస్టార్ అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. వీధిలో ఉంటే తాజాగా ఈరోజు సాయంత్రం ఇదే సినిమా నుండి సాయి ధరమ్ తేజ్ లుక్ రివీల్ చేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ వైట్ డ్రెస్ లో సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లో నడుచుకుంటూ వస్తు అదరగొట్టింది.

Another update from Pawan Kalyan Sai Dharam Tej BRO

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మరోసారి తన అదిరిపోయే బాణీలు ఈ పోస్టర్ ద్వారా అందించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇదే సినిమాలో ఐటెం సాంగ్ కోసం దర్శకుడు సముద్రఖని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం శృతిహాసన్, దిశాపటనీని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఐటెం సాంగ్ లో వీరిద్దరిలో ఒకరిని ఫైనల్ చేయనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ పాటలో పవన్ సాయి ధరమ్ తేజ్ ఇద్దరు కలిసి స్టెప్పులు వెయ్యబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.


Share

Related posts

Devatha Serial: అమ్మకు అమ్మైన దేవి..! రాధ నిర్ణయం మార్చుకుందా..!? 

bharani jella

బన్ని, సుక్కు .. హ్యాట్రిక్

Siva Prasad

Corona Devi Statue: కరోనా దేవి విగ్రహం ఆ నటిలా ఉందంటూ ట్రోలింగ్..!!

bharani jella