“RRR” ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సినిమా రావటంతో ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జనాలు పెట్టుకున్నా అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా రాజమౌళి మరోసారి తన దర్శకత్వ దమ్మేంటో “RRR” ద్వారా నిరూపించారు. బాహుబలి తో మాత్రమే కాదు ఈ సినిమాతో సైతం సినిమా ప్రపంచాన్ని ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ వైపు చూసేలా చేశాడు. “RRR” ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం జరిగింది.
సినిమా ధియేటర్ లో మాత్రమే కాదు..ఓటిటి లో సైతం అనేక రికార్డులు సృష్టించడం జరిగింది. సినిమా విడుదలయ్యి ఆరు నెలలు కావస్తున్నా గాని ఓటిటిలో ఇంకా రికార్డులు కొనసాగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే నెట్ ప్లిక్స్ లో దాదాపు 14 వారాలు పాటు ప్రపంచవ్యాప్తంగా నెంబర్ వన్ ట్రెండింగ్ లో నాన్ ఇంగ్లీష్ సినిమాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని”RRR” సినిమా యూనిట్ ట్విట్టర్ వేదికగా ప్రకటించడం జరిగింది. ఓటీటిలో మాత్రమే కాదు ఆగస్టు 14వ తారీకు పలు భాషలలో టెలివిజన్ లో కూడా ప్రసారం కావడం జరిగింది.
ఈ క్రమంలో మలయాళం భాషలో టిఆర్పి రేటింగ్ లలో “RRR” సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. నెట్ ఫ్లిక్స్ లో “RRR” చూసి చాలామంది హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు దర్శకుడు రాజమౌళి హీరో చరణ్ మరియు తారక్ లను పొగుడుతూ వస్తున్నారు. ఈ సినిమా కంటే “బాహుబలి” భారీ విజయం సాధించిన గాని ఆ టైంలో ఓటిటికి పెద్ద డిమాండ్ లేకపోవడంతో.. “బాహుబలి” కంటే “RRR” ప్రపంచవ్యాప్తంగా సెన్సేషనల్ గా నిలిచింది.