Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో “అఖండ” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు కొన్ని సంవత్సరాల నుండి బాలయ్య బాబు వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. దీంతో ఈ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన సింహ, లెజెండ్ సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో “అఖండ” సినిమాతో హ్యాట్రిక్ విజయం సాధించి బాలయ్యకి బోయపాటి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.
ఈ సినిమాలో ఇప్పటికే రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే. రాయలసీమ ఫ్యాక్షన్ పాత్ర అదే రీతిలో అఘోర పాత్రలో బాలయ్య కనిపిస్తూ ఉండటంతో.. సినిమా స్టోరీ ఏంటి అన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత బాలయ్య బాబు వరుసగా కుర్ర డైరెక్టర్లను లైన్ లో పెట్టడం జరిగింది. గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి వంటి దర్శకులతో ఇప్పటికే బాలయ్య సినిమా ఒప్పుకోవటం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో కుర్ర డైరెక్టర్ కి బాలయ్య అవకాశం ఇచ్చినట్లు ఫిలిం వర్గాల టాక్.
Read More: Akhanda : హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న అఖండ.. డిజిటల్ రైట్స్ కు భారీ ఆఫర్..
మేటర్ లోకి వెళ్తే తొలిప్రేమ, రంగ్ దే లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన అట్లూరి వెంకీ తో సినిమా చేయాలని బాలయ్య కమిటీ అయినట్లు సమాచారం. ఇటీవల ఆయనకు స్టోరీ వినిపించినట్లు పూర్తి లైన్ విన్నాక.. ఈ ప్రాజెక్టు అధికారికంగా ప్రకటించడానికి సినిమా యూనిట్ రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అఖండ సినిమా అయిన వెంటనే.. ఈ ప్రాజెక్టులను వరుసగా కంప్లీట్ చేయాలని బాలయ్య అనుకుంటున్నట్లు అందుకనే కుర్ర డైరెక్టర్లతో పనిచేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం. కరోనా తీసుకొచ్చిన గ్యాప్ .. కుర్ర దర్శకులతో పని చేసి పూడ్చాలని బాలయ్య ప్లాన్ అట.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?