Ante Sundaraniki: న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `అంటే.. సుందరానికీ!`. శ్యామ్ సింగరాయ్ వంటి సూపర్ హిట్ తర్వాత నాని నుంచి వస్తున్న చిత్రమిది. ఇందులో మలయాళ ముద్దుగుమ్మ నజ్రీయా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. సీనియర్ నటుడు నరేష్, రోహిణి, నదియా, హర్షవర్ధన్, రాహుల్ రామకృష్ణ, సుహాస్ ముఖ్య పాత్రలు పోషించారు.
లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. జూన్ 10న విడుదల అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తూ.. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. ఈ విషయాన్ని ఓ స్పెషల్ పోస్టర్‌తో మేకర్స్ స్వయంగా తెలియజేశారు. దీంతో ఈ చిత్రంలో కావాల్సినంత వినోదం ఉండబోతోందని, ప్రేక్షకులు నవ్వుల పండక్కి సిద్ధమవ్వాల్సిందే అని సినీ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకున్నాడు.
కాగా, ప్రతష్టాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమాయకపు బ్రాహ్మణ యువకుడు సుందర్ ప్రసాద్ గా నాని నటిస్తే.. క్రిస్టియన్ యువతి లీలా థామస్ గా నజ్రియా నజీమ్ చేసింది. మంచి అంచనాలు ఉన్న ఈ మూవీ తెలుగులోనే కాకుండా తమళ్, కన్నడ, మలయాళ భాషల్లో సైతం రిలీజ్ కాబోతోంది.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!