సినిమా

Hero Nani: నాని ఫ్రస్టేషన్.. మొహం పగిలిపోద్దంటూ వార్నింగ్..!

Share

Hero Nani: న్యాచుర‌ల్ స్టార్ నాని ఫిబ్రవరి 24న బ‌ర్త్‌డే జ‌రుపుకోబోతున్నారు. ఈ సంద‌ర్భంగా ఒక రోజు ముందుగానే ఆయ‌న న‌టిస్తున్న `అంటే.. సుందరానికీ` సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్ వ‌చ్చింది. వేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ బ్యానర్ పై నవీన్ యెర్నేని.. వై. రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ ఇందులో హీరోయిన్‏గా న‌టిస్తోంది. అయితే రేపు నాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా నేడు `యువ సుంద‌రుడి బ‌ర్త్‌డే హోమం మొద‌లైంది` పేరుతో టీజ‌ర్‌ను మేకర్స్‌ సోష‌ల్ మీడియా ద్వారా వ‌దిలారు. హీరో పుట్టినరోజు కావ‌డంతో అతని ఇంట్లో ఆయుష్య హోమం చేయ‌డంలో ప్రారంభ‌మైన ఈ టీజ‌ర్ ఆద్యంతం అద్భుతంగా ఆక‌ట్టుకుంది.

అయితే సుంద‌రానికి హోమాలు అస్స‌లు ఇష్టం ఉండ‌దు. `మీ చాదస్తం తగేలయ్యా.. ఇంకా రెండు హోమాలు చేస్తే.. అన్ని హోమాలు చేసిన వాడిగా గిన్నీస్ బుక్‌లో ఎక్కోచ్చు` అంటూ ఫ్ర‌స్టేష‌న్‌తో నాని డైలాగ్ చెప్ప‌డం సూప‌ర్ ఫన్నీగా ఉంటుంది. గండాల పేరు త‌ర‌చూ ఇంట్లో హోమాలు చేయడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొనే ఒక బ్రాహ్మణ యువకుడి పాత్రలో నాని అల‌రించ‌బోతున్నాడు.

`ఏం గండాలో.. బయటకు వస్తే.. ద్విచక్ర వాహన గండం, నీళ్లలోకి వెళితే.. జల గండం.. నడిస్తే రోడ్డు గండటం.. కుర్చుంటే కుర్చీ గండం.. దీన‌మ్మ గండం.. ఇంకోసారి గండాలు, హోమాలు అంటే మొహం ప‌గిలిపోద్ది` అంటూ అమ్మ‌కు నాని వార్నింగ్ ఇవ్వ‌డం మ‌రింత అల‌రిస్తుంది. మొత్తానికి అదిరిపోయిన ఈ టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాల‌ను పెంచేసింది.

ఇక మేక‌ర్స్ టీజ‌ర్‌తో పాటు విడుద‌ల తేదీని ప్ర‌క‌టించారు. `అంటే… మా వాడి జాతకం ప్రకారం బ‌ర్త్‌డే హోమం జరిగిన 108 రోజుల‌ వరకు బయటికి రాకూడదన్నారు, అందుకే జూన్ 10న మిమ్మల్ని నవ్వించడానికి థియేట‌ర్స్‌కి వస్తున్నాడు. హ్యాపీ బ‌ర్త్‌డే సుంద‌ర్‌, బ్లాక్‌బ‌స్ట‌ర్‌ ప్రాప్తిరస్తు` అంటూ ట్వీట్ చేశారు.

 

 


Share

Related posts

Anaswara Rajan Joshful Looks

Gallery Desk

‘విలనిజం’కు బై.. బై..! చేయాల్సింది వేరే ఉందంటున్న విలన్

Muraliak

బాలీవుడ్ స్టార్స్ కే చమటలు పట్టిస్తున్న మన ప్రభాస్ ..!

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar