ప్రస్తుతం కొంతమంది హీరోయిన్స్ ఛాన్స్‌ల కోసం స్టార్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఏం చెప్పిన చేసేందుకు సై అంటున్నారు. సినిమా సూపర్ హిట్ అవడానికి హీరోయిజం ఎంత అవసరమో హీరోయిన్ ఎక్స్పోజింగ్ కూడా అంతే అవసరం అవుతుంది. ఇదివరకు సినిమాల్లో నవరసాలు సమానంగా కనిపించేవి కానీ ఇప్పుడు మాత్రం గ్లామర్ మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికి సినిమాల్లో కనీసం ఒక సాంగ్‌లో అయినా హీరోయిన్ బికినీ వేయాలి. అలానే హీరోతో ఒక లిప్ కిస్ ఉండాలి.
అనుపమ అలా నిర్ణయం
ఆ సీన్స్నే హైలెట్ చేసి టీజర్స్‌లో చూపిస్తూ ప్రేక్షకులను థియేటర్స్ వరకూ వచ్చేలా చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇండస్ట్రీలో మరొక ఘోరం కూడా జరుగుతుందని టాక్. అదేంటంటే, ముందు కొన్ని సన్నివేశాలు చెప్పి మిగతా సన్నివేశాలు దాయడం. అన్ని కాంట్రాక్ట్ అయిపోయాక ముందుగా చెప్పని బోల్డ్ సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్ లో నటించాలని బలవంతంగా ఒప్పించడం. ఇండిస్ట్రీలో మనుగడ సాగటం, డబ్బు సంపాదించడం ముఖ్యం కాబట్టి వారు కూడా నిర్మాతలు చెప్పినట్టు చేయడానికి సిద్ధమవుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం అదే బాటలో నడవాలని అనుకుంటోంది. కెరీర్ ప్రారంభంలో అనుపమ హోమ్లీ అండ్ డీసెంట్ రోల్స్‌లో నటించి యూత్నే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఎంటర్టైన్ చేసింది. ఆల్ట్రా మోడరన్, గ్లామర్ రోల్స్ చేయడానికి ఆమె అంతగా ఇష్టపడలేదు. దాంతో ఆమెకు ఫ్లాప్స్ ఎదురయ్యాయి. ఫ్లాప్ హీరోయిన్ అని ఆమెను ఎవరూ కూడా తీసుకోవడానికి ఇష్టపడటం లేదు.
మరో మార్గం లేదన్నట్టు
ఇలాంటి సమయంలో స్టార్ట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, అనుపమకి ఒక ఆఫర్స్ ఇచ్చాడు. దిల్ రాజు తన అన్న కొడుకుని హీరోగా పెట్టి రౌడీ బాయ్స్ అనే సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఇందులో కొత్త అమ్మాయిని హీరోయిన్ గా తీసుకుంటే దెబ్బయిపోతుందని.. అనుపమ పరమేశ్వరన్‌ని ఈ మూవీ కోసం తీసుకున్నారు. అంతేకాదు, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సినిమాలో హీరోకి లిప్ కిస్ ఇవ్వాలని అనుపమని ముందుగానే ఒప్పించాడు దిల్ రాజు. అయితే గతంలో ఇలాంటి పాత్రలకు దూరంగా ఉన్నా అనుపమ తన కెరీర్ బాగు కోసం హీరోని లిప్ లాక్ చేసింది. అయితే ఇందుకుగాను ఈ ముద్దుగుమ్మ భారీగానే డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏ హీరోయిన్ అయినా చివరికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడదని అనుపమ నిరూపిస్తోంది.