Anupama: అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ కుట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ప్రేమమ్` అనే మలయాళ మూవీతో సినీరంగ ప్రవేశం చేసి.. `అ ఆ`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టిందీ బ్యూటీ. ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన అనుపమ.. మంచి నటి అనిపించుకుంది. కానీ, స్టార్ హోదాను పొందలేకపోయింది.
కానీ, ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ తన అందం, అభినయంతోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ `బటర్ ఫ్లై` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతోంది. ఘంటా సతీష్ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జెన్ నెక్స్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి ప్రకాష్ బోడపాటి, ప్రసాద్ తిరువళ్లూరి, ప్రదీప్ నల్లిమెల్లి నిర్మించారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అనుపమ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం అనుపమ దర్శకనిర్మాతలతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది.
ఈ క్రమంలోనే తాను సింగిల్ కాదు, మింగిల్ అని ప్రేమ, పెళ్లిపై బిగ్ సీక్రెట్ ను రివిల్ చేసింది. అసలు ఏం జరిగిందంటే.. ఇంటర్వ్యూలో పెళ్లిపై ప్రశ్న ఎదురవ్వగా.. అందుకు అనుపమ `నేను ఖచ్చితంగా లవ్ మ్యారేజే చేసుకుంటా. అరేంజ్ మ్యారేజ్ అస్సలు చేసుకోను. ఇప్పటికే ప్రేమలో ఉన్నాను. కానీ, నేను ప్రేమించే వ్యక్తి నన్ను ప్రేమిస్తున్నాడా..లేదా.. అన్నది నాకు తెలియదు. నాది వన్ సైడ్ లవ్. నా రిలేషన్ షిప్ పై నాకింకా క్లారిటీ రాలేదు` అని చెప్పుకొచ్చింది. దీంతో ఆమె కామెంట్స్ కాస్త నెట్టింట వైరల్‌గా మారాయి.