కూటికోసం కోటి తిప్పలు అనే సమేతను ఎప్పటికీ మరిచిపోవద్దని పెద్దలు చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజం. దానికోసమే ఒక్కోక్కరూ ఒక్కో పని చేస్తూ.. పొట్ట నింపుకుంటారు. పని చేతకానోడు మాటలతో పూట గడుపుతాడు. అలా మాటలు నేర్చిన కొంత మంది దొంగలు బాబాలుగా సమాజంలో నేటికీ చలామణి అవుతున్నారు. వారు చేసే ఆకృత్యాలను ఏ ప్రభుత్వం, ఏ ఆఫీసర్లు ఆపలేకపోతున్నారు. కొందరిని ఇప్పటికే పట్టుకున్న ఆఫీసర్లు ఇంకొందరిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు.
అయితే అలాంటి దొంగ బాబాలు మాయలో పడి ఎంతో మంది జీవితాలు ఆగం అయ్యాయి. మాములు జనాలే కాదు.. సినిమా యాక్టర్లు కూడా వారి వలలో పడిన బాధితులే అని ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. వారి పేర్లను వారు ప్రస్థావించకున్నా వారికి జరిగిన అన్యాయాలను మాత్రం బయటి జనాలకు తెలిసేలా చేస్తున్నారు. ఇలాంటి బాబాలను నమ్మొదని సూచిస్తున్నారు.
ఇక విషయానికి వస్తే.. అనుప్రియ గోయెంక మన తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ బాలీవుడ్లో మంచి మంచి క్యారెక్టర్లు చేసి తనకంటు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ లో తన తన చిన్న వయసులో తనపై జరిగిన లైంగిక వేధింపుల గురించి ప్రస్థావించింది.
ఈ బామ బాబీ ఆశ్రమ్ 2 వెబ్ సిరీస్లో నటించింది. అలాగే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన టైగర్ జిందా హై సినిమాలోను నటించింది. వాటితో పాటు పద్మావత్, వార్ సినిమాల్లో తనదైన శైలీలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ ముద్దుగుమ్మకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు లైంగిక వేధింపులకు గురైందని తెలిపింది. ఆశ్రమ్ 2 వెబ్ సిరీస్ ప్రచారంలో భాగంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలిపింది. ఈ సందర్భంగా అనుప్రియ కొన్ని విషయాలను తెలుపుతూ.. వాళ్ల ఫ్యామిలీ చాలా కాలంగా ఒక బాబాను ఎంతగానో నమ్మేవారని తెలిపింది. ఆ బాబా మాటలంటే వాళ్లకు వేద వాక్కని తెలిపింది.
ఇలా స్టార్ట్ అయిన ఆ నమ్మకం ఒక రోజు ఆ బాబా తనను లొంగదీసుకోవాలనుకునే వరకు వచ్చిందని తెలిపింది. దాంతో తను ఎంతో భయపడినట్లు తెలిపింది. అప్పుడు తన వయసు 18 ఏళ్లు. ఆ సమయంలో అనుప్రియ ఎలాగో అలా తప్పించుకున్నట్లు తెలిపింది. ఆ విషయాన్ని చాలా రోజులకు ఇంట్లో చెప్పింది. కానీ బాబాపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిపింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!