Anushka: టాలీవుడ్ బ్యూటీ అనుష్క గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు.. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటుంది.. అనుష్క పుట్టిన రోజున తన తల్లిదండ్రులతో ఉన్న పాత ఫోటో ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.. ఇటీవల కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగడంతో.. దేశీయ ప్రముఖ మైక్రో బ్లాగింగ్ నెట్వర్కింగ్ “కూ” యాప్ కు విశేష ఆదరణ లభిస్తోంది.. తాజాగా స్వీటీ కూడా కూ యాప్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు ట్విట్టర్ వేదికగా తెలియజేశారు..
హాయ్ ఆల్.. మీరందరూ బాగున్నారని సురక్షితంగా ఉన్నారని ఆశిస్తున్నాను.. రాబోయే రోజుల్లో కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం నా అధికారిక కూ ఖాతాలో నన్ను ఫాలో అవ్వండి.. ధన్యవాదాలు అంటూ అనుష్క ట్వీట్ చేసింది.. అయితే అనుష్క కూ లో మొదటి పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వేల సంఖ్యలో ఫాలోవర్లు ఫాలో అవడం విశేషం.. ఇకనుంచి అనుష్క కు సంబంధించిన అన్ని అప్డేట్స్ ఈ యాప్ ద్వారా అభిమానులకు తెలియజేయనుంది.