Anushka: 2005వ సంవత్సరంలో నాగార్జునతో “సూపర్” సినిమాలో హీరోయిన్ గా అడుగుపెట్టిన అనుష్క అతి తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ క్రియేట్ చేసుకుంది. ఒక్క తెలుగులో మాత్రమే కాక సౌత్ ఇండియాలో అనేక భాషల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ “బాహుబలి” సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. పొడుగు కాళ్ల సుందరి అయినా అనుష్క ఇండస్ట్రీలో చాలామంది టాప్ హీరోలతో నటించడం జరిగింది. హీరోలతో మాత్రమే కాక హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అనేక విజయాలు దక్కించుకున్న అనుష్క “బాహుబలి” తర్వాత చేసిన “సైజ్ జీరో” మూవీ ఆమె కెరియర్ కి భారీగా దెబ్బ వేసింది.
ప్రయోగాత్మకంగా చేసిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావడంతో తర్వాత అనుష్కకి పెద్దగా అవకాశాలు రాలేదన్నట్లు ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి.” సైజ్ జీరో” సినిమా కోసం భారీగా అనుష్క లావు అవడం కారణంగానే తర్వాత ఆమెకు అవకాశాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినపడ్డాయి. ఇదిలా ఉంటే మరో సారి అనుష్క లావు అవ్వడానికి రెడీ అయినట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. మేటర్ లోకి వెళితే “జాతిరత్నాలు” సినిమాతో మంచి గుర్తింపు దక్కించుకున్న నవీన్ పోలిశెట్టి తో ఓ సినిమా చేయడానికి అనుష్క రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీ లో వినపడుతోంది.
ఓ యువకుడు తన కంటే పెద్ద వయసు కలిగిన ఆమెతో ప్రేమలో పడిన స్టోరీ తరహాలో ఈ సినిమా ఉన్నట్లు .. దీంతో తన క్యారెక్టర్ కోసం అనుష్క మరొకసారి లావు అవటానికి సై అన్నట్లు ఫిలిం నగర్ టాక్. బాగా ఫేట్టి బాడీ తో అనుష్క సినిమాలో రాణించాలని.. నవీన్ పోలిశెట్టి బాడీకి పూర్తి ఆపోజిట్ గా స్క్రీన్ మీద కనబడాలని డైట్ విషయంలో ఎక్కడా తగ్గటం లేదట. దీంతో ఈ వార్త తెలుసుకుని అనుష్క అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇప్పటికే కెరియర్ డౌన్ లో ఉంది.. మళ్లీ ప్రయోగాలు అవసరమా అంటూ తాజా వార్త పై సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.