NewsOrbit
Entertainment News సినిమా

Anushka: హమ్మయ్య ఇన్నాళ్ళకి అనుష్క పెళ్లి చేసుకుంటోంది .. ఫుల్ డీటైల్స్ ఇవే !

Advertisements
Share

Anushka: హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకున్న హీరోయిన్. తెలుగు ఇంకా తమిళ్ సినిమా రంగాలలో అనేక హిట్ సినిమాలలో నటించింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన “సూపర్” సినిమా ద్వారా… సినిమా రంగంలో అడుగు పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన “విక్రమార్కుడు” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం సొంతం చేసుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలు చేసిన అనుష్క భారతీయ చలనచిత్ర రంగంలో అన్ని రికార్డులను బ్రేక్ చేసిన “బాహుబలి”లో దేవసేనగా రాణి పాత్రలో మెప్పించింది. హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలలో కూడా అనుష్క “అరుంధతి” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా అనుష్క కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

Advertisements

Anushka gave clarity on her marriage at Miss Shetty Mr. Polishetty movie promotion event

“బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత అనుష్క ప్రయోగాలకు పోయి “సైజు జీ”రో సినిమా కోసం బాగా లావు అయింది. తీరా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత అనుష్కకి అవకాశాలు రాకుండా పోయాయి. ప్రస్తుతం “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమా చేయడం జరిగింది. ఈ వారంలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే 41 సంవత్సరాలు వయసు కలిగిన అనుష్క పెళ్లికి సంబంధించి ఎప్పటినుండో అనేకమైన వార్తలు వస్తూ ఉన్నాయి. ఆమె పెళ్లి చేసుకుంటే చూడాలని మరోపక్క అభిమానులు కూడా వెయిట్ చేస్తున్నారు. అప్పట్లో ప్రభాస్… అనుష్క పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ప్రభాస్ మరో పక్క అనుష్క.. తాము బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పడం జరిగింది. పెళ్లికి సంబంధించి అనుష్క వ్యతిరేకం అన్నట్లు కొన్ని వార్తలు సోషల్ మీడియాలో షికారులు చేశాయి. ఈ వార్తలపై తాజాగా నవీన్ పోలిశెట్టితో నటించిన కొత్త సినిమా “మిస్ శెట్టి… మిస్టర్ పొలిశెట్టి” ప్రమోషన్ కార్యక్రమంలో అనుష్క క్లారిటీ ఇచ్చింది.

Advertisements

Anushka gave clarity on her marriage at Miss Shetty Mr. Polishetty movie promotion event

“మిస్ శెట్టి… మిస్టర్ పొలిశెట్టి” సినిమా చాలా మంది అమ్మాయిలకు కనెక్ట్ అవుతుందని అనుష్క పేర్కొంది. నవీన్ పోలిశెట్టితో నటించడం చాలా ఫన్నీగా ఉందని.. తెరపై మా కాంబో ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారని స్పష్టం చేసింది. ఈ క్రమంలో యాంకర్ మీ పెళ్లి గురించి ఏదైనా గుడ్ న్యూస్ చెబుతారా అని అడగగానే అనుష్క సమాధానం ఇస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. కానీ దానికి టైం కావాలి. అప్పట్లో నేను పెళ్లికి వ్యతిరేకం అని కొంతమంది ప్రచారం చేశారు. కానీ కాదు… నేను కచ్చితంగా జీవితంలో పెళ్లి చేసుకుంటాను. ఆ సమయం వచ్చినప్పుడు అందరికీ చెబుతాను. త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వినిపిస్తాను” అని అనుష్క క్లారిటీ ఇవ్వటం జరిగింది. దీంతో తమ అభిమాన హీరోయిన్ పెళ్లి చేసుకోదేమో అని అప్పట్లో వచ్చిన వార్తలకు.. కంగారు పడ్డ అభిమానులు తాజాగా ఇచ్చిన సమాధానంతో హమ్మయ్య ఇన్నాళ్ళకి.. అనుష్క పెళ్లికి సంబంధించి మంచి విషయం చెప్పింది అంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మరోపక్క అనుష్క ఇంట్లో ఆల్రెడీ సంబంధాలు చూడటం గత ఏడాది నుండే స్టార్ట్ చేయడం జరిగిందట. దీంతో ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో త్వరలోనే పెళ్లికి సంబంధించి న్యూస్ వింటారు అన్నట్టు ప్రమోషన్ కార్యక్రమాలలో అనుష్క తెలియజేయడం జరిగింది.


Share
Advertisements

Related posts

సీనియర్ సినీ నటుడు విద్యాసాగర్ రాజు కన్నుమూత

somaraju sharma

బిగ్ బాస్ స్టేజి పై పంచ్ ల వర్షం కురిపించిన హైపర్ ఆది! వామ్మో ఎవరినీ వదల్లేదు..!

arun kanna

బిగ్ బాస్ 4 : అమ్మో దివి సైలెంట్ గా ఉంటుంది కానీ మామూలు పిల్ల కాదు – నాగార్జున కూడా వామ్మో అనుకున్నాడు !!

sekhar