ప్యాన్ ఇండియా చిత్రంగా అనుష్క మూవీ


అనుష్క శెట్టి ప్ర‌ధాన పాత్ర‌ధారిగా హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. కోన‌వెంక‌ట్‌, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముందు తెలుగు, త‌మిళంలోనే ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సినిమాను ఇంగ్లీష్‌, మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లో కూడా విడుద‌ల చేస్తున్నార‌ట‌. డిసెంబ‌ర్‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్స్ జ‌రుగుతున్నాయి. ఇంగ్లీష్‌లో `సైలెన్స్‌` అనే పేరుతో మిగిలిన భాష‌ల్లో `నిశ్శ‌బ్దం` పేరుతో సినిమా విడుద‌ల‌వుతుంది.
క్రాస్ జోన‌ర్‌లో విడుద‌ల కాబోతున్న ఈ సినిమాలో అనుష్క సాక్షి అనే అంధురాలి పాత్ర‌లో న‌టిస్తుంది. మాధ‌వ‌న్‌, మైకేల్ హ‌డ్స‌న్‌, అంజ‌లి, షాలిని పాండే త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. గ‌త ఏడాది `భాగ‌మ‌తి` త‌ర్వాత అనుష్క న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.