Anushka sharma : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ కొంతకాలం పాటు ప్రేమించుకుని 2017 వ సంవత్సరంలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఒకరు హీరోయిన్ కాగా మరొకరు క్రికెటర్ కావడంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ జంట సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు. సోషల్ మీడియా ద్వారా వారికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా వీరి వివాహ బంధానికి గుర్తుగా ఈ నెల 11వ తేదీన ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.
జనవరి 11న తమ జీవితంలోకి గారాలపట్టి వచ్చిందని తెలియజేసిన ఈ జంట తమ కూతురిని చూపించడానికి ఇష్టపడలేదు. అంతేకాకుండా తమ కూతురు గురించి ఎటువంటి వార్తలు రాయవద్దని మీడియా కూడా తెలియజేసిన ఈ జంట తాజాగా ఫిబ్రవరి 2వ తేదీన తన కూతురు నామ కరణ మహోత్సవం సందర్భంగా మొదటి ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. అయితే తన పాప ముఖాన్ని చూపించకుండా ఇద్దరు తన కూతురిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం వల్ల కొంతవరకు అభిమానులు నిరాశ చెందారు. తాజాగా అనుష్క శర్మ తన సెల్ఫీ ఫోటోను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఇప్పుడు అదే తన ఫేవరెట్ అంటున్న అనుష్క శర్మ:
అనుష్క శర్మ తాజాగా అద్దంలో చూసుకుంటూ సెల్ఫీ దిగిన ఫోటోను తన ఇంస్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు. ఈ ఫోటోలో అనుష్క తన కూతురిని ఎత్తుకోవడానికి ఉపయోగించే ఒక వస్త్రాన్ని భుజం పై వేసుకొని సెల్ఫీ దిగుతూ.. ప్రస్తుతం అదే తన ఫేవరెట్ అని కామెంట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్లు డెలివరీ తర్వాత కూడా అనుష్క ఇంత ఫిట్ గా ఉండటం చూసి ఆశ్చర్యపోతున్నారు. అయితే తన గారాలపట్టికి “వామిక”అని నామకరణం చేసిన సంగతి మనకు తెలిసినదే. వీరిద్దరి పేర్లు కలిపి తన కూతురికి
“వామిక”అని నామకరణం చేశారు. “వామిక” అనగా అమ్మవారి పేరు అని అర్థం. అయితే ఈ జంట తమ ముద్దుల కూతురు ముఖచిత్రాన్ని ఎప్పుడు చూపిస్తారనే ఆత్రుతతో అభిమానులు ఎదురు చూస్తున్నారు.