అనుష్క అనగానే వెండతెరపై మెరిసిన జేజమ్మ, దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలు కనిపిస్తాయి. అంతలా ఆ క్యారెక్టర్లలో ఒదిగిపోయి నటించింది మరి అనుష్క. హీరోయిన్ కేవలం సినిమాతో అందాల ఆరబోతకే పరిమితం కాదని నిరూపించింది. తన నటనతో సినిమాను విజయ తీరాల వైపు నడిపించి.. బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగించి.. హీరోలకు ధీటుగా మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. నేడు (శనివారం) అనుష్క బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె జీవితంలో ఇప్పటివరకూ చోటుచేసుకున్న కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..
అనుష్క పుట్టి పెరిగింది కర్నాటకలోని మంగుళూరులోనే. పాఠశాల, కళాశాల విద్యను బెంగుళూరులో కొనసాగించారు. అనుష్క అసలు పేరు స్వీటీ శెట్టి. కుటుంబ సభ్యులు స్వీటీ అని, సన్నిహిత స్నేహితులు టొమ్ములు అని పిలుస్తారట. బీసీఏ చేసిన అనుష్క.. పిట్నెస్ రంగంలో తన కెరియర్ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు పూరీజగన్నాథ్… నాగార్జునతో సూపర్ సినిమా తీస్తుండగా.. అనుష్క గురించి తెలిసి.. యోగా టీచర్ గా కొనసాగుతున్న అనుష్కకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే స్వీటీ అని పిలవడం అంతగా బాగులేదని అనడంతో.. అనుష్కగా తన పేరును మార్చుకున్నారట ఈ దేవసేన.
కాగా, ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సూపర్ సినిమా షూటింగ్ విషయాలు చెబుతూ.. తన జీవితంలో ఆ సినిమాను మర్చిపోలేననీ, మరీ ముఖ్యంగా పూరి జగన్నాథ్‌ను కలవడం గురించి జీవితాంతం గుర్తుంచు కుంటానని తెలిపింది. ఎందుకంటే పూరిని కలిసిన ఆ రోజు తన జీవితాన్ని పూర్తిగా మార్చిందనీ.. తాను నేడు ఈ స్థాయిలో ఉండటానికి ఆ రోజు పూరి జగన్నాథ్‌ను కలవడమే కారణమని పలుమార్లు చెప్పారు అనుష్క, అలాగే, సూపర్ సినిమాలో నటిస్తున్న క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డాననీ, ఆ సినిమాలో నటించిన వారందరూ ఎంతగానో అండగా నిలిచారని తెలిపారు.
కాగా, వెండితెరపై తన అందాలను ఆరబోసినప్పటికీ.. సాధారణంగా అనుష్క సాంప్రదాయ పద్దతిలో కుందనపు బొమ్మలా కనిపిస్తుంటారు. ప్రభాస్ తో కలిసి.. బిల్లా సినిమాలో నటించడం.. తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి వాళ్ల అమ్మ షాకయ్యారని తెలిపారు. యోగా, సినిమా కెరియర్ ప్రారంభించడానికి ముందు స్కూల్ టీచర్‌గా కూడా పనిచేశారట ఈ జేజమ్మ. అలాగే, సినిమాల లైఫ్ గురించి చెబుతూ.. అందం అవకాశాలు తీసుకువస్తుంది… కానీ దానితోనే ముందుకు సాగడం కుదరదని తెలిపారు. తన ప్రపంచం అంతా సినిమా షూటింగులు, తన ఇల్లు మాత్రమేననీ, మిగతా సమయాల్లో అందుకే తాను బయటకనిపించనని తెలిపారు. ఇక సినిమా క్యాస్టింగ్ కోచ్ విషయాలను తాను నమ్మననీ, ఎందుకంటే తనకు ఇప్పటివరకూ అలాంటి ఘటనలు తను ఎదుర్కోలేదని తెలిపారు.