సినిమా

Anushka: తండ్రితో అనుష్క చిలిపి పోజులు.. వైర‌ల్‌గా మారిన ఇన్‌స్టా పోస్ట్‌!

Share

Anushka: అనుష్క శెట్టి.. ఈ పేరు తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కించిన `సూప‌ర్‌` సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. త‌న‌దైన టాలెంట్‌తో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హోదాను అందుకుంది. దాదాపు 15 ఏళ్ల పాతు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన అనుష్క‌.. తెర‌పై కనిపించి చాలా కాల‌మే అయింది.

`భాగ‌మ‌తి` త‌ర్వాత సినిమాలు చేయ‌డం బాగా త‌గ్గించేసిన అనుష్క‌.. చివ‌రిగా `నిశ్శబ్దం`తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. 2020లో ఓటీటీ వేదిక‌గా భారీ అంచ‌నాల న‌డుమ వ‌చ్చిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో పూర్తిగా విఫలం అయింది. ఇక ఆపై అనుష్క నుంచి మ‌రో సినిమా రాలేదు. అయితే ప్ర‌స్తుతం ఈమె కన్నడ ఫిల్మ్ డైరెక్టర్ పి.మహేష్ తో ఓ సినిమా చేస్తోంది.

యూవీ క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో న‌వీన్ పొలిశెట్టి హీరోగా న‌టిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. ఇక‌పోతే అనుష్క సినిమాలు చేయ‌డం త‌గ్గించినా.. సోష‌ల్ మీడియాలో మాత్రం అభిమానుల‌ను అల‌రిస్తుంటుంది. మ‌రీ అంత యాక్టివ్‌గా ఉండ‌క‌పోయినా.. ఏదైనా ప్రత్యేక రోజుల్లో, ముఖ్యమైన సందర్భాల్లో పోస్ట్‌లు పెడుతుంటుంది.

అయితే తాజాగా అనుష్క తండ్రి ఏఎన్ విట్టల్ శెట్టి పుట్టిన రోజు జ‌రుపుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే తండ్ర‌తో క‌లిసి అనుష్క చిలిపిగా ఫొటోల‌కు పోజులు ఇచ్చి.. ఆ ఫొటోల‌కు ఓ గ్రూప్ పిక్‌గా ఇన్‌స్టాలో షేర్ చేసింది. అలాగే `సంవత్సరాలు గడిచిపోతున్నా.. నాకు ఎంత వయసొచ్చినా సరే.. నేనెప్పుడూ నీ చిన్నారినే నాన్న. పుట్టినరోజు శుభాకాంక్షలు పాపా` అంటూ తండ్రికి శుభాకాంక్ష‌లు కూడా తెలిపింది. దీంతో అనుష్క ఇన్‌స్టా పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ముఖ్యంగా ఆమె షేర్ చేసి పిక్ చూసి అభిమానులు మ‌రియు నెటిజ‌న్లు ఫిదా అవుతున్నారు.

https://www.instagram.com/p/CckiEKVvExv/?utm_source=ig_web_copy_link


Share

Related posts

Sreemukhi RED Movie Celebrations Pics

Gallery Desk

Akira Nandan: సినిమాల్లోకి పవన్ కుమారుడు అకీరా ఎంట్రీ.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రేణు దేశాయ్..!?

bharani jella

ఇంతకీ ఎప్పుడొస్తావ్ చిన్నవాడా

Siva Prasad