28.2 C
Hyderabad
December 6, 2022
NewOrbit
సినిమా

Anushka Shetty: అనుష్క ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. త్వ‌ర‌లోనే ఆ ప్ర‌క‌ట‌న‌..?

Share

Anushka Shetty: `బాహుబ‌లి` త‌ర్వాత అనుష్క శెట్టి పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు. ఈమె చివ‌రిగా `నిశ్శబ్దం` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. హేమంత్ మధుకర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మాధవన్, అంజలి, షాలిని పాండే కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2020 అక్టోబ‌ర్ 2న ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదిక‌గా విడుద‌లైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్‌ను సొంతం చేసుకుంది.

ఈ సినిమా త‌ర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న అనుష్క‌.. గ‌త ఏడాది త‌న 48వ సినిమాను ప్ర‌క‌టించింది. ‘రా రా కృష్ణయ్య’ ఫేం మహేశ్​.పి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ సినిమాను యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నిర్మితం కాబోతోంది. నవీన్​ పోలిశెట్టి హీరోగా న‌టించ‌బోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది.

ఇదిలా ఉండ‌గా.. అనుష్క ఫ్యాన్స్‌ను సంతోష పెట్టే ఓ గుడ్‌న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. తమిళ స్టార్ దర్శకుడు ఎ.ఎల్.విజయ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట‌. ఇదో లేడీ ఓరియంటెడ్ చిత్ర‌మ‌ని.. దీనిని తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే సారి తెర‌కెక్కించ‌బోతున్నార‌ని టాక్ న‌డుస్తోంది. అంతేకాదు, త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌ట‌క‌న కూడా రానుంద‌ట‌.


Share

Related posts

Kajal Aggarwal Amazing Looks

Gallery Desk

‘లాల్‌ సింగ్‌ చడ్డా’ లో నాగ చైతన్య పాత్రపై చిరంజీవి కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Naresh’s third wife ramya attack: నరేష్, పవిత్ర లోకేష్ ల.. జంటపై పోలీసుల ముందే చెప్పుతో దాడికి పాల్పడ్డ నరేష్ మూడో భార్య రమ్య ..!!

sekhar