Anushka: ఒకప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా చలామణి అయింది స్వీటీ అనుష్క. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన “సూపర్” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. అనతికాలంలోనే తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుంది. రాజమౌళి దర్శకత్వంలో “బాహుబలి” సినిమాలో రాణి పాత్రలో మరింతగా మెప్పించింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో కనుమరుగైపోయిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలకు “అరుంధతి”తో అనుష్క మళ్ళీ ఊపిరి పోసింది. అన్ని రకాలుగా సక్సెస్ అనుభవించిన స్వీటీ అనుష్క కెరీర్ లో చేసిన ఒక ప్రయోగం ఆమెకు సక్సెస్ ఫుల్ కేరియర్ ని భారీ డ్యామేజ్ కి తీసుకు వచ్చినట్లు అయింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“బాహుబలి” వంటి హిస్టరీ క్రియేట్ చేసిన సినిమా తర్వాత అనుష్క నటించిన ప్రయోగాత్మక చిత్రం “సైజ్ జీరో”. ఈ సినిమాలో.. పాత్ర కోసం అనుష్క చాలా లావుగా తయారు కావడం జరిగింది. తీరా సైజ్ జీరో సినిమా రిలీజయ్యాక.. అట్టర్ ఫ్లాప్ కావడం జరిగింది. దీంతో అప్పటి నుండి అనుష్కకి అవకాశాల తగ్గటం మొదలయ్యాయి. సైజ్ జీరో తర్వాత అనుష్క నటించిన సినిమా నిశ్శబ్దం. ఈ సినిమాలో కూడా చాలా లావుగానే కనిపించడం జరిగింది. అయితే ఈ క్రమంలో మధ్యలో కరోనా రావడంతో భారీ గ్యాప్ రావడంతో అనుష్క పని అయిపోయింది అనుకున్న టైంలో… యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ లో నవీన్ పొలిశెట్టి హీరోగా.. ఒక వైవిధ్యమైన లవ్ స్టోరీ లో… హీరోయిన్ గా అనుష్క నీ ప్రకటించడం తెలిసిందే.
అయితే ఈ సినిమాకి సంబంధించి అనుష్క మినహా సన్నివేశాలు మొత్తం షూట్ చేస్తున్నారట. కానీ అనుష్క మాత్రం ఇప్పటివరకు షూటింగ్ లో జాయిన్ కాకపోవటంతో ఇంకా ఆమె సైజు తగ్గించుకునే పనిలో ఉన్నట్లు.. వార్తలు వస్తున్నాయి. దీంతో యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ సినిమా యూనిట్… అనుష్క విషయంలో కంగారు పడుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తనకంటే పెద్ద అమ్మాయిని ప్రేమించే యువకుడిగా నవీన్ పోలిశెట్టి కనిపిస్తుండగా పెద్దావిడ పాత్రలో.. అనుష్క ఈ సినిమాలో నటించనున్నట్లు సమాచారం.