మ‌రో భ‌క్తి ర‌స‌ చిత్రంలో ..


మ‌హిళా ప్రాధాన్యత ఉన్న చిత్రాల‌కు ముందు అనుష్క బెస్ట్ అప్ష‌న్‌గా ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు క‌న‌ప‌డుతుంది. త‌ర్వాతే మ‌రో హీరోయిన్ చాయిస్‌గా చూస్తున్నారు. అరుంధ‌తి, రుద్ర‌మ‌దేవి, బాహుబ‌లిలో దేవ‌సేన,భాగ‌మ‌తి చిత్రంలో పాత్ర‌ల‌కు త‌న‌దైన న‌ట‌న‌తో అనుష్క ప్రాణం పోసింది. అయితే జీరో సినిమాకు పెరిగిన లావు స‌మ‌స్య‌ను త‌గ్గించుకోవ‌డానికి అనుష్క ట్రీట్ మెంట్ తీసుకుని స‌న్న‌బ‌డింది. ఇప్పుడు సైలెన్స్ అనే సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో న‌టిస్తుంది. ఇది పూర్తి కాగానే.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంతోష్ శివ‌న్ డైరెక్ట్ చేయ‌బోయే భ‌క్తిర‌స చిత్రంలో కీల‌క పాత్ర‌ధారిగా న‌టించ‌నుంది. అయ్య‌ప్ప‌స్వామిపై సంతోష్ శివ‌న్ ఓ సినిమాను చేయ‌బోతున్నారు. ఈ చిత్రంలో అనుష్క న‌టించ‌నుంది. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో సినిమా విడుద‌ల కానుంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్‌లో సినిమా ప్రారంభ‌మ‌వుతుంద‌ని టాక్‌. అన్నీ అనుకున్న‌ట్లు కుదిరితే.. గ‌తంలో నాగార్జునతో క‌లిసి ఓం న‌మో వేంక‌టేశాయ చిత్రంలో కృష్ణ‌మ్మ పాత్ర‌లో న‌టించిన అనుష్క త్వ‌ర‌లోనే మ‌రో భ‌క్తి చిత్రంలో నటించ‌నుంది.