చిరు, చ‌ర‌ణ్‌ల‌కు ధ‌న్య‌వాదాలు:అనుష్క‌


టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి .. త‌న‌ను `సైరా న‌ర‌సింహారెడ్డి` చిత్రంలో భాగ‌స్వామిని చేసినందుకు మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రామ్‌చ‌ర‌ణ్‌ల‌కు థ్యాంక్స్ చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి` అక్టోబ‌ర్ 2న విడుద‌లై ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాలో ఝాన్సీ ల‌క్ష్మీబాయ్‌గా అతిథి పాత్ర‌లో న‌టించిన అనుష్క సోష‌ల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్‌కు థ్యాంక్స్ చెప్పింది.
“చిరంజీవిగారు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగారి పాత్ర‌లో త‌న కృషి, అనుభ‌వంతో ఒదిగిపోయారు. గొప్ప స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడి సినిమాలో నా వంతు బాధ్య‌త‌ను నేను నిర్వ‌ర్తించాను. యూనిట్ న‌న్ను ఎంత‌గానో ప్ర‌శంసించింది. ఈ సినిమాలో న‌న్ను భాగం చేసిన చిరంజీవిగారికి, రామ్‌చ‌ర‌ణ్‌గారికి, సురేంద‌ర్ రెడ్డిగారికి ధ‌న్య‌వాదాలు. నా మీద ప్రేమాభిమానాలు చూపిస్తున్న అభిమానుల‌కు థ్యాంక్స్‌“ అన్నారు.