టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఇప్పుడు రచయితగా మారారు. ఓ సినిమా కోసం వెయిట్ పెరిగిన అనుష్క దాన్ని తగ్గించుకోవడానికి మాత్రం చాలా కష్టాలే పడింది. `భాగమతి` సినిమా తర్వాత మరే సినిమాలో అనుష్క నటించలేదు. దాదాపు ఏడాది పాటు సినిమాలకు దూరంగాఉండి.. లైఫ్ స్టైల్‌ను మార్చుకుని స్లిమ్‌గా తయారైంది. ఇటీవల ఆమె స్లిమ్‌గా తయారైందని చెప్పడానికి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలే అందుకు నిదర్శనం. అయితే లైఫ్ స్టైల్‌ను మార్చుకోవడం ద్వారా సహజంగా వెయిట్ ఎలా తగ్గవచ్చు దానిపై ఇప్పుడు అనుష్క ఓ పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకం పేరు `ది మేజిక్ వెయిట్ లాస్ పిల్`. ల్యూక్ కుటినో, అనుష్క కలిసి ఈ పుస్తకాన్ని రాశారు. పెంగ్విన్ సంస్థ ఈ పుస్తకాన్ని అచ్చువేయనుంది. 62 రకాల లైఫ్ స్టైల్స్‌ను మార్చుకోవడం ద్వారా వెయిట్ లాస్‌ను ఎలా తగ్గించుకోవచ్చునని ఈ పుస్తకంలో అనుష్క, ల్యూక్ వివరించారట.
previous post
next post
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!