AP Cinema: ఏపిలో సినిమా టికెట్ల విషయంలో ప్రభుత్వం వర్సెస్ థియేటర్ యాజమాన్యాల మధ్య వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం వరుస తనిఖీలతో థియేటర్ల యాజమాన్యం బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిణామం తెలుగు సినీ పరిశ్రమను ఆందోళన కల్గిస్తోంది. నిబంధనలు పాటించని థియేటర్ లకు జరిమానాలు విధించడం, సీజ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిణామాలపై పలువురు సినీ ప్రముఖులు వ్యాఖ్యలు చేయడం, దానికి మంత్రులు తమదైన శైలిలో స్పందించారు. మరో పక్క రాష్ట్రంల పెద్ద సంఖ్యలో థియేటర్ లు స్వచ్చందంగా మూసివేశారు. తగ్గింపు ధరలతో ధియేటర్ లు రన్ చేయలేమంటూ స్వచ్చందంగా మూసివేసి థియేటర్ ల ముందు బోర్డులు పెట్టేశారు. ఈ నేపథ్యంలో నేడు ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రభుత్వంతో చర్చలకు ధియేటర్ల యజామాన్యాలు, డిస్టిబ్యుటర్ లు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. టికెట్ ధరల తగ్గింపు వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలన రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకువెళ్లేందుకు సమాయత్తమైయ్యారు. ఈ విషయంపై మంత్రి పేర్ని నాని కలిసేందుకు ఆపాయింట్మెంట్ కోరగా డిస్ట్రిబ్యూటర్లతో చర్చించేందుకు ఆపాయింట్మెంట్ ఖరారు చేసినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు 20 మంది డిస్ట్రిబ్యూటర్లు మంత్రిని కలిసేందుకు అనుమతి ఇచ్చారు. సినిమా టికెట్ రేట్ల విషయంపై పలువురు నిర్మాతలు, హీరోల వ్యాఖ్యలతో తాము ఇబ్బంది పడుతున్నట్లు ధియేటర్ల యాజమానులు, డిస్ట్రిబ్యూటర్లు పేర్కొంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలతో థియేటర్ల నిర్వహణ కష్టమని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరనున్నారు.
మరో పక్క ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దీనిపై స్పందించారు. త్వరలో తాము కూడా ఏపి ప్రభుత్వాన్ని కలుస్తామన్నారు. ఏపి సీఎం వైఎస్ జగన్, మంత్రి పేర్ని నానిల ఆపాయింట్మెంట్ లు తీసుకుని కలుస్తామన్నారు. సమస్యల త్వరలో పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇండస్ట్రీ నుండి ఎవరకూ ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని ఆయన సూచించారు. హీరో నాని ఆవేదనతో చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నారన్నారు. సున్నితమైన ఈ అంశంలో మీడియా కూడా సహకరించాలని కోరారు.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…