బయోపిక్స్ ట్రెండ్ నడుస్తుంది. జయాపజయాలకు సంబంధం లేకుండా పలు రంగాల్లో ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్ కొన్ని వెండితెరపై సందడి చేశాయి. మరికొన్ని సందడికి సిద్ధమవుతున్నాయి. ఈ కోవలో మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె.అబ్దుల్ కలాం బయోపిక్ రూపొందనుంది. “1998లో మే 11న కలాంగారి నేతృత్వంలో న్యూక్లియర్ టెస్ట్ సక్సెస్ అయ్యింది. ప్రతి కథలోనూ హీరో ఉంటాడు. ఆయన బయోపిక్‌ను తెరెక్కించబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం“ అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్. అభిషేక్ పిక్చర్స్‌తో పాటు, ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!