రజినీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్న అభిమానులకి సూపర్ స్టార్ అదిరిపోయే న్యూస్ చెప్పడానికి రెడీ అవుతున్నాడు. అయితే అది పొలిటికల్ ఎంట్రీ గురించి కాదు, సినిమా గురించి కావడం విశేషం. గత కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్న రజినీ, ప్రస్తుతం పెట్టా సినిమా ఇచ్చిన సక్సస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ లో అన్ని సెంటర్స్ నుంచి హిట్ టాక్ తెచ్చుకోని తలైవా అభిమానులకి కొత్త జోష్ ని ఇచ్చింది.
పెట్టా సినిమా అయిపోయిన తర్వాత రజినీకాంత్ గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్న ఈ సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కించబోతుండడం విశేషం. ఇప్పటికే రజినీ-మురుగ కాంబినేషన్ గురించి రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడీ కలయిక కన్ఫర్మ్ అయ్యింది. నార్కలీ అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కబోతుందని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. నార్కలీ అంటే కుర్చీ అని అర్ధం. ఫిబ్రవరి రెండో వారంలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో రజినీకాంత్ సీఎంగా కనిపించనున్నాడని కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించిన దర్శకుడు మురుగదాస్ తన నెక్స్ట్ సినిమా టైటిల్ నార్కలీ కాదని కన్ఫార్మ్ చేశాడు. దీంతో ఇప్పటి వరకూ వచ్చిన వార్తలకి చెక్ పడింది. కొత్త టైటిల్ ఏంటనేది ఇప్పటి వరకైతే ఎవరికీ తెలియదు కానీ మురుగదాస్ మాత్రం రజినీతో పొలిటికల్ సినిమా అందరికీ షాక్ ఇచ్చే రేంజులో తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు.
గత కొంత కాలంగా పొలిటికల్ మూవీస్ చేయడంలో రాటుదేలిన మురుగదాస్, రీసెంట్ గా సర్కార్ సినిమాతో ప్రస్తుత తమిళ రాజకీయ పరిస్థితులని ప్రశ్నిస్తూనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. దాదాపు 260కోట్లు రాబట్టిన సర్కార్, మురుగదాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సర్కార్ తరహాలోనే రజినీకి తగ్గట్లు ఉండే కథని సిద్ధం చేసిన మురుగదాస్, ఇప్పటికే లైన్ ఫైనల్ చేసి పూర్తి కథని కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడట. అన్నీ కుదిరితే ఇది మురుగదాస్ మార్క్ రజిని సినిమా అవుతుందని కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. రజినీకాంత్ పొలిటికల్ కెరీర్ కి ఈ సినిమా ఎంత వరకు ఉపయోగ పడుతుంది? సీఎంగా రజినీ ఎలా కనిపిస్తాడు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!