29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

RRR for Oscar: “నాటు నాటు” సాంగ్ కు ఆస్కార్ రావాలి ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు..!!

Share

RRR for Oscar: “RRR” నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆస్కార్ అవార్డు రావాలని భారతీయ సినిమా ప్రేమికులు ఎంతగానో కోరుకుంటున్నారు. మరోపక్క గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ విషయంపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. “RRR” లోని “నాటు నాటు” సాంగ్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో… ఆస్కార్ గెలవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే… మనలో ఎవరికైనా ఏ అవార్డు వచ్చినా అది ఇండియా ప్రతిష్టను పెంచుతుంది”అని రెహ్మాన్ స్పష్టం చేశారు.

AR Rahman's sensational comments for the song Natu Natu deserve an Oscar

మరోపక్క సోషల్ మీడియాలో “RRR” నాటు నాటు సాంగ్ విషయంపై చర్చ జరుగుతుంది. ప్రతిష్టాత్మక ఆస్కార్ వేదికపై టాలీవుడ్ సినిమా సాంగ్ గెలుస్తుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి కొద్ది గంటల్లో “ది అవార్డు గోస్ టూ…నాటు నాటు” అనే ప్రకటన కోసం భారతీయ సినిమా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో #RRRforoscar అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో చాలామంది బెట్టింగ్లు కూడా కడుతున్నారు. ఏది ఏమైనా రేపు ఉదయం కల్లా “RRR” కీ ఆస్కార్ వస్తుందో రాదో తేలిపోనుంది.

AR Rahman's sensational comments for the song Natu Natu deserve an Oscar

కాగా ఇప్పటికే ఈ సాంగ్ కీ గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంతో… కచ్చితంగా ఆస్కార్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సినిమా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సాంగ్ బాగా పాపులర్ కావటంతో పాటు చరణ్, ఎన్టీఆర్ స్టెపులు కూడా వైరల్ కావడంతో కచ్చితంగా అవార్డు వస్తుందని చెప్పుకొస్తున్నారు. “RRR” కీ ఆస్కార్ అవార్డు వస్తే మాత్రం తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయి మరింత ఉన్నత స్థానానికి పెరగటం గ్యారెంటీ. ఈ సినిమాతో దర్శకుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు మరియు నిర్మాణ సంస్థలు రాజమౌళితో కలసి పనిచేయటానికి కూడా రెడీ అవుతున్నారు.


Share

Related posts

Review Zombie Reddy : రివ్యూ – జాంబీ రెడ్డి

siddhu

Allu Arjun: అల్లూ అర్జున్ క్రేజ్ అరాచకం .. పుష్ప డాన్స్ స్టెప్ తో ఏడుపు ఆపేసిన నార్త్ ఇండియన్ పాప ?

sekhar

Kanika Mann Gorgeous Images

Gallery Desk