29.2 C
Hyderabad
March 21, 2023
NewsOrbit
Entertainment News సినిమా

AR Rahman: అర్హత లేని సినిమాలు ఆస్కార్ కీ అంటూ ఏఆర్ రెహమాన్ వైరల్ కామెంట్స్..!!

Share

AR Rahman: మార్చి 13వ తారీకు ఆస్కార్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలలో ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ ఫీలింతో పాటు “RRR” నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలవడం జరిగింది. ఎన్నడూ లేని రీతిలో ఈసారి భారీ ఎత్తున ఆస్కార్ బరిలో భారతీయ చలనచిత్రాలు సత్తా చాటాయి. దీంతో దేశవ్యాప్తంగా సినిమా సెలబ్రిటీలు రాజకీయ నేతలు ప్రధాని మోడీ సైతం ఆస్కార్ గెలిచిన వారిని అభినందించారు. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఏఆర్ రెహమాన్ తన యూట్యూబ్ ఛానల్ లో ఓ ప్రముఖ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తూ… ఇండియన్ ఫిలిం ఫెడరేషన్… ఆస్కార్ కీ “RRR” నీ సెలెక్ట్ చేయకపోవడంపై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. అర్హత లేని సినిమాలను ఆస్కార్ కి నామినేట్ చేసి… మంచి కంటెంట్ ఉన్న సినిమాలను పక్కన పెట్టేయడం దారుణమని అన్నారు. సంగీత పరంగా ఇంకా డాక్యుమెంటరీ పరంగా ఆస్కార్ అవార్డులు మన దేశానికి వచ్చాయి.

AR Rahman's viral comments saying that unqualified films are the key to Oscars

కానీ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఇప్పటివరకు ఒక ఆస్కార్ అవార్డు కూడా రాలేదు. స్థానిక ప్రధాన కారణం ఇండియన్ ఫిలిం ఫెడరేషన్.. రాంగ్ సినిమాలను ఆస్కార్ కి నామినేట్ చేస్తున్నారు. అందుకే ఉత్తమ చిత్రం విభాగంలో ఇప్పటివరకు ఇండియా ఒక ఆస్కార్ అవార్డు కూడా గెలవలేదని స్పష్టం చేశారు. తన యూట్యూబ్ ఛానల్ లో ఎల్ సుబ్రహ్మణ్యంతో నిర్వహించిన మాటామంతిలో సంగీతం గురించి అదే విధంగా మారుతున్న టెక్నాలజీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహమాన్ ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ వ్యవహరిస్తున్న తీరు వల్లే ఆస్కార్ బరిలో చాలా వరకు ఇండియా సినిమాలు సత్తా చాటలేకపోతున్నాయని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో వెస్ట్రన్ సంగీతాన్ని వింటున్నప్పుడు మన సంగీతాన్ని… ఎందుకు వినటం లేదని రెహమాన్ ప్రశ్నించారు.

AR Rahman's viral comments saying that unqualified films are the key to Oscars

దీనికి ఎల్ సుబ్రహ్మణ్యం ప్రతిస్పందించి.. “RRR” ను అధికారికంగా ఆస్కార్ కి నామినేట్ చేసి ఉంటే… బెస్ట్ ఇంటర్నేషనల్ మనకు ఆస్కార్ వచ్చేదని పేర్కొన్నారు. ఈ ఏడాదికి సంబంధించి ఆస్కార్ నామినేషన్ టైములో ఇండియా నుండి ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ గుజరాతి సినిమాని ఉత్తమ చిత్రంగా నామినేట్ చేయడం జరిగింది. ఆ సమయంలో “RRR” చేసి ఉంటే బాగుండేది అని సినీ ప్రేమికులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ ఈ విషయంలో “RRR” సినిమా యూనిట్… అకాడమీ సభ్యులకు స్పెషల్ షోస్ వేయించి… ఎలాగైతే ఆస్కార్ కి నామినేట్ అయ్యేలా చేసి చివరకి అవార్డు గెలుచుకోవడం జరిగింది.


Share

Related posts

రీల్ క‌పిల్ టీం

Siva Prasad

మెడిక‌ల్ ప్రొఫెస‌ర్‌… విజ‌య‌శాంతి

Siva Prasad

రివ్యూ : సోలో బ్రతుకే సో బెటర్..!

siddhu