మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా `సైరా నరసింహారెడ్డి` పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. అక్టోబర్ 2న సినిమాను తెలుగు,త మిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన మొట్టమొదటి యోధుడు ఓ తెలుగువాడు కావడం మన గొప్పగా చెప్పుకోవాల్సిన తరుణం. చరిత్ర పుటల్లో కానరాని భాస్కరుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందింది. తమిళంలో మెగాస్టార్ చిరంజీవి కోసం అరవిందస్వామి డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో చిరు పాత్రకు తమిళంలో ఎవరితో డబ్బింగ్ చెప్పించాలని నిర్మాత రామ్‌చరణ్ అనుకుంటున్న తరుణంలో స్వయంగా అరవింస్వామి ఫోన్ చేసి తాను డబ్బింగ్ చెబుతానని కోరాడట. ధృవ సినిమాలో చరణ్, అరవిందస్వామి కలిసి పనిచేసి ఉన్నారు. అప్పటి నుండి ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండటంతో అరవిందస్వామి రిక్వెస్ట్‌ను చరణ్ కాదనలేకపోయాడని సినీ వర్గాల సమాచారం.
previous post
next post