NBK 107: నటుడు అరవింద స్వామి అందరికి సుపరిచితుడే. “రోజా” సినిమాతో హీరోగా పరిచయమైన అరవిందస్వామి.. దక్షిణాది సినిమా రంగంలో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. చాలా కాలం సినిమాలకు దూరమైన అరవిందస్వామి కొద్ది సంవత్సరాల క్రితం మోహన్ రాజ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తరకెత్తిన ధ్రువ సినిమాలో విలన్ పాత్రలో కనిపించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న సినిమాలో కీలకపాత్రలో అరవిందస్వామి నటిస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ గా వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా “NBK 107” వర్కింగ్ టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇంకా పవర్ఫుల్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలో అరవింద స్వామికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినట్లు త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొన్నటి వరకు కర్నూలు ప్రాంతంలో జరగక ఇప్పుడు టర్కీ ప్రాంతంలో జరుగుతూ ఉంది. బాలయ్య పుట్టినరోజు నాడు సినిమాకి సంబంధించి విడుదలైన ఫస్ట్ వీడియో సోషల్ మీడియాలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది.
ఆ వీడియో బట్టి చూస్తే రాయలసీమ బ్యాక్ డ్రాప్ తరహాలో.. స్టోరీ ఉండనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో బాలయ్య ఫ్యాక్షన్ లీడర్ గా.. నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గత ఏడాది అఖండ రిలీజ్ అయిన రోజు నాడే ఈ సినిమా కూడా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!