బాలీవుడ్ ప్రేమ జంటలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా తన ప్రియుడు నిక్కి జోనస్‌ను పెళ్లి చేసుకుంటే రణవీర్ సింగ్ దీపికా పదుకొనెను ఇటీవలే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రణభీర్ కపూర్, అలియా భట్ కూడా ఈ లిస్టులో ఉన్నారు. అయితే అర్జున్ కపూర్ కూడా మలైకా అరోరాను పెళ్లి చేసుకోబోతున్నాడని ఏడాది పాటు వార్తలు వినపడుతూ వస్తున్నాయి. అయితే ఓ వారం క్రితం మాత్రం .. ఈ నెల 19న వీరిద్దరూ ఓ చర్ఛిలో పెళ్లి చేసుకుంటారనే వార్త వైరల్ అయ్యింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ఇదంతా బాగానే ఉన్నా.. సమస్యంతా అర్భాజ్ఖాన్కి వచ్చి పడింది. ఆదివారం జరిగిన ఓ ప్రెస్మీట్లో ఓ విలేఖరి… అర్జున్ కపూర్, మలైకా అరోరా పెళ్లి గురించి అర్జాజ్ను ప్రశ్నించాడు. పాపం.. తనేం చెబుతాడు. ఏం చెప్పాలో తెలియక నవ్వేశాడు. దాంతో అక్కడున్న అందరూ నవ్వేశారు. తర్వాత అర్బాజ్ విలేఖరిని ఉద్దేశించి మాట్లాడుతూ “మీరు ఈ ప్రశ్న అడగటానికి రాత్రంతా కూర్చుని ఎలా అడగాలని బాగా ఆలోచించి ఉంటారు కదా!. అలాగే నేను కూడా సమాధానం చెప్పడానికి ఆలోచించాలి. మీ ప్రశ్నకు సమాధానం రేపు చెబుతా“ అన్నారు. మొత్తానికి అర్భాజ్ చాలా తెలివిగా చెప్పాల్సిన సమాధానాన్ని దాటేశాడు.
ఏం చెప్పాలో తెలియక అర్బాజ్ ఇబ్బంది పడుతుంటే మరో పక్క అర్జున్‌కపూర్, మలైకా అరోరా కలిసి బ్యాచిలర్ పార్టీని మాల్దీవుల్లో సెలబ్రేట్ చేసుకుంటుంది. అక్కడ తీసిన కొన్ని ఫోటోలను ఆమె తన ఇన్‌స్టా అకౌంట్లో షేర్ చేశారు. ఈ ఫోటోలను అర్జున్ కపూర్ లైక్ చేశారు.