బిగ్ బాస్ నాలుగో సీజన్ 43వ రోజు నామినేషన్ ప్రక్రియ లో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర గందరగోళం నెలకొంది. ఇద్దరిద్దరిని గ్రూపులుగా విభజించి వారినే చర్చించుకోమని ఒకరు నామినేట్ కావలసిందిగా బిగ్ బాస్ ఆదేశించాడు. ఇక అరియానా, మెహబూబ్ దిల్ సే మధ్య ఒకరు నామినేట్ కావాల్సి ఉండడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. మెహబూబ్ ప్రవర్తన, మాటల పై అరియానా తీవ్రస్థాయిలో మండిపడింది.
మెహబూబ్ తనని తాను నామినేట్ చేసుకునేందుకు నిరాకరించడంతో అరియానా తీవ్ర అసహనానికి లోనయింది. అంత సేపు చర్చించుకున్న తర్వాత అతను ఎలాంటి సపోర్ట్ ఇవ్వడం లేదని అర్థం అయింది కాబట్టి తాను ఒక నిర్ణయానికి వచ్చే పరిస్థితి లేదని…. కాబట్టి నామినేట్ చేసుకునేందుకే మొగ్గుచూపుతున్నట్లు అరియానా చెప్పింది.
ఇక తనను తాను నామినేట్ చేసుకున్న తర్వాత మహబూబ్…. అరియానా దగ్గరికి వచ్చి నేను నీకు మళ్ళీ ఎప్పుడైనా సహాయం చేస్తాను నువ్వు ఎలిమినేషన్ నుండి బయటపడతావు అని ఆమెకి ఏదో చెప్పగా.. అరియానా కనీసం మొహం కూడా చూడకుండా వెళ్ళిపోయింది.
అరియానా భారీగా హర్ట్ కావడంతో ఆమెను బుజ్జగించేందుకు రంగంలోకి దిగాడు సోహెల్. మనం గమనించినట్లైతే సోహెల్ ఒక వారం మెహబూబ్ ను ఎలిమినేషన్ నుండి కాపాడాడు. ఇప్పుడు అరియానా బుజ్జగిస్తే నేను మెహబూబ్ సంగతి చూస్తా…. నేనేమి ఫీల్ కావట్లేదు నన్ను ఒకరు సహాయం చేయమని అడిగారు నేను సహాయం చేసి బయటకు వెళ్తున్నాను అని అనుకుంటాను అని చెప్పింది.