Ashoka Vanamlo Arjuna Kalyanam: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజా చిత్రం `అశోకవనంలో అర్జున కళ్యాణం`. విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్, రితిక నాయక్ హీరోయిన్లుగా నటించారు. గోపరాజు రమణ, కాదంబరి కిరణ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్-సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మించారు.
భారీ అంచనాల నడుమ నేడు గ్రాండ్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వయసు పైబడినా ఇంకా పెళ్లికాలేదు అనే ఆత్మన్యూనతా భావంతో బాధపడేవారందరికి ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. తెలంగాణ సూర్యాపేటలో వడ్డీ వ్యాపారం చేసే అర్జున్ కుమార్ అల్లంగా విశ్వక్ సేన్ తనదైన నటనతో అదరగొట్టేశాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గొప్ప కథ ఏమీ లేకపోయినా.. రెండున్నర గంటలు మనసుకు ఆహ్లాదాన్ని పంచే సినిమాగా నిలిచింది. ఇదిలా ఉంటే.. కరోనా వచ్చిన తర్వాత బిగ్ స్క్రీన్ పై వచ్చిన సినిమాలన్నీ.. ఓటీటీ వేదికగా మళ్లీ రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అశోకవనంలో అర్జున కళ్యాణం ఓటీటీ రిలీజ్పై ఓ నయా అప్డేట్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` సాలిడ్ రేటుకు సొంతం చేసుకుందట. ఈ సినిమా విడుదలైన నెల రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారట. అంటే జూన్ మొదటి వారంలో లేదా రెండో ఈమూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!