Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో అతిపెద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాలు నిర్మించిన నిర్మాత అశ్వినీదత్. వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేతగా తెలుగు చలనచిత్ర రంగంలో అనేక సూపర్ సూపర్ హిట్ సినిమాలు అందించడం జరిగింది. మెగాస్టార్ చిరంజీవితో జగదేకవీరుడు అతిలోకసుందరి, ఇంద్ర, చూడాలని ఉంది, జై చిరంజీవ. ఈ నాలుగింటిలో మొదటి మూడు సినిమాలు తెలుగు బాక్స్ ఆఫీస్ వద్ద అనేక రికార్డులు క్రియేట్ చేశాయి. జై చిరంజీవ పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
కరోనా తర్వాత ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర రంగంలో ఏ హీరో విడుదల చేయని రీతిలో దాదాపు నాలుగు సినిమాలు విడుదల చేశారు. మొదట ఆచార్య అది అట్టర్ ప్లాప్ అయ్యింది. తర్వాత గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో రెండు విజయాలు అందుకున్నారు. లేటెస్ట్ గా ఆగస్టు నెలలో “భోళా శంకర్” విడుదల చేసి పరాజయం పొందుకోవటం జరిగింది. ప్రస్తుతం చిరంజీవి రెండు సినిమాలను లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ రెండు పక్కన పెడితే మరొకటి అశ్వినీదత్ నిర్మాణ సారథ్యంలో బిగ్ ప్రాజెక్టు చేయడానికి చిరంజీవి సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇక దర్శకుడు విషయానికొస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిరంజీవి ఈ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. సీనియర్ హీరోకి తగ్గ విధంగా చాలా కొత్తగా స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జనవరిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవితో సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంత ఒకే అయితే వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రారంభం కానున్నట్లు వార్తలు వస్తున్నయి.