సినిమా

SVP: “సర్కారు వారి పాట”లో హైలెట్ అదే.. దానికోసం మళ్ళీ మళ్ళీ థియేటర్ కి వస్తారంటున్న మహేష్..!!

Share

SVP: “సర్కారు వారి పాట” ఫ్రీ రిలీజ్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత మహేష్ సినిమాకి సంబంధించి ఈవెంట్ కావటంతో.. వేడుక జరిగే ప్రాంగణం మొత్తం అభిమానులతో నిండిపోయింది. “జై బాబు.. జై జై బాబు” అంటూ అభిమానులు అరుపులు కేకలతో వేడుకకు మరింత గ్లామర్ తీసుకొచ్చారు. ముఖ్య అతిథులుగా ఎవరూ హాజరు కాలేదు. సినిమా యూనిట్ తో పాటు మహేష్ తో పని చేసిన డైరెక్టర్లు వచ్చారు. ఈ సందర్భంగా మహేష్ బాబు ప్రసంగిస్తూ సినిమా గురించి అనేక విశేషాలను తెలియజేశారు. కచ్చితంగా తన కెరీర్లో మరో “పోకిరి” అవుతుందని పేర్కొన్నారు.

at SVP pre release event mahesh babu viral comments

అంతమాత్రమే కాదు ఈ సినిమా కోసం పని చేస్తుంటే “పోకిరి”.. రోజులు గుర్తొచ్చాయి అని పేర్కొన్నారు. ఇక సినిమా మొత్తానికి హైలెట్…హీరో … హీరోయిన్ ట్రాక్. కచ్చితంగా సినిమా చూసిన ఆడియన్స్ నీ మళ్లీ సినిమా చూసేలా.. హీరో-హీరోయిన్ ట్రాక్ డిజైన్ చేయడం జరిగింది. సినిమా చూశాక మీరు కూడా ఇదే తెలియజేస్తారు. “సర్కారు వారి పాట” కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. నా కెరీర్ లో ఇది మర్చిపోలేను బ్లాక్ బస్టర్ అవుతుంది.. అన్న నమ్మకం ఉంది అంటూ మహేష్.. సినిమా విజయం పట్ల చాలా ధీమాగా కామెంట్లు చేశారు. మహేష్ వ్యాఖ్యలతో అభిమానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అయ్యారు.

 

ఇదే సమయంలో హీరోయిన్ కీర్తి సురేష్ నటించిన సినిమాలు మొత్తం ఒక ఎత్తు అయితే ..”సర్కారు వారి పాట” చాలా డిఫరెంట్ అని అన్నారు. కచ్చితంగా కీర్తి సురేష్ కి మంచి పేరు వస్తుందని మహేష్ తెలిపాడు. తమన్ అందించిన మ్యూజిక్.. ఈ సినిమాకి మరింత హైలెట్ అవుతుందని మహేష్ స్పష్టంచేశాడు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. నేను పెద్ద ఫ్యాన్ .. మన సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు అని మహేష్ కామెంట్లు చేయటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. మే 12వ తారీకు మరోసారి పండుగ వస్తుంది… అందరు రెడీగా ఉండండి. మీ .. అభిమానం ఎప్పుడూ ఇలాగే చూపించండి.. మరింతగా ముందుకు దూసుకుపోతున్న అంటూ మహేష్ చేసిన వ్యాఖ్యలకు అభిమానులు నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.


Share

Related posts

అఖిల్ కి షాక్ ఇచ్చిన మోనాల్…. నా అసలు లవర్ అతనే అని ఫ్ల్యాష్ బ్యాక్ బయటపెట్టిన గుజరాతీ బ్యూటీ

arun kanna

Mega 154: `మెగా 154`లో భాగ‌మ‌వుతున్న చిరు పెద్ద కూతురు..!

kavya N

బిగ్ బాస్ 4 : మోనాల్ దృష్టిలో A అంటే అవినాష్ అట..! ముద్దు కూడా పెట్టేసింది…

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar