Anchor Suma: టెలివిజన్ ప్రేక్షకులకు పరిచయం చేయక్కర్లేని పేరు యాంకర్ సుమ. ఎన్నో టీవీ షోలకు హోస్ట్ గా చేస్తూ చాలా కార్యక్రమాలు సక్సెస్ చేయడం జరిగింది. కేవలం టీవీ షోలు మాత్రమే కాదు చలనచిత్ర రంగంలో అనేక సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ లకు కూడా ఎక్కువగా సుమయే యాంకరింగ్ చేస్తూ ఉంటది. పైగా ఇండస్ట్రీలో సెంటిమెంట్ కూడా ఉంది. అదేమిటంటే యాంకర్ సుమ ఆధ్వర్యంలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ ల సినిమాలు ఎక్కువగా బ్లాక్ బస్టర్ అవుతాయని. దీంతో చాలామంది ఆమెకి అవకాశాలు ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలో ఎటువంటి పెద్ద హీరోల ప్రీ రిలీజ్ ఈవెంట్ లలో ఎలాంటి పరిస్థితులునైనా అన్నిటిని చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తూ.. కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటది.
కేరళకి చెందిన అమ్మాయి అయినా గాని ఎప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. తెలుగు ప్రేక్షకుల హృదయాలను సుమా గెలుచుకుంది. ఫుల్ ఎనర్జీతో చలాకి తనంతో ఒకపక్క తన మాటలతో… ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటది. యాంకరింగ్ మాత్రమే కాదు ఒకప్పుడు సినిమాల్లో కూడా నటించింది. ప్రభాస్ నటించిన వర్షం సినిమాలో.. కూడా కీలకమైన రోల్ చేయడం జరిగింది. ఆ తర్వాత యాంకరింగ్ రంగంలో అడుగుపెట్టి.. సక్సెస్ సాధించి విజయవంతంగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా ప్రముఖ టీవీ ఛానల్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమతో పాటు ఒకప్పటి యాంకర్ శిల్ప చక్రవర్తి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ చేశారు.
ఈ ప్రోమోలో యాంకర్ సుమ గురించి తోటి యాంకర్ శిల్పా చక్రవర్తి ఎమోషనల్ కామెంట్స్ చేసింది. యాంకర్ సుమ చాలా కష్టపడుతుందని.. ఈ క్రమంలో ఆమె కార్యక్రమాలు ముగించుకుని ఇంటికెళ్లే సమయానికి చాలా టైం అయ్యేది. కొన్నిసార్లు షూటింగ్ ఆలస్యం కావడంతో ఇంటికి వెళ్లే సరిగా తలుపులు తీయకపోతే అక్కడే మెట్ల మీదే పడుకునేది. నేను చాలా సార్లు సుమాను అలా చూశాను అని శిల్పా తెలిపింది. దీంతో శిల్పా మాటలకు స్టేజి పైన సుమ కన్నీళ్లు పెట్టుకుంది. అదే కార్యక్రమానికి సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన సుమా కొడుకు స్టేజి పైకి వచ్చి తల్లిని హత్తుకుని ఎమోషనల్ అయ్యాడు.