దాదాపు రెండు సంవత్సరాలు కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ అనేక ఇబ్బందులు ఎదుర్కోవటం తెలిసిందే. 2020లో లాక్ డౌన్ కారణంగా ఆ ఏడాది పెద్దగా సినిమాలు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత ఏడాది నెలల గ్యాప్ లో కొన్ని సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. కానీ ఈ ఏడాది ప్రారంభంలో బయట ప్రపంచంలో పరిస్థితులు సద్దుమనగటంతో కేసులు కూడా తగ్గడంతో దాదాపు ప్రతిష్టాత్మకంగా తరికెక్కిన సినిమాలు మొత్తం ఫస్ట్ ఆఫ్ లోనే విడుదలయ్యాయి. RRR, KGF 2, రాధేశ్యామ్, ఆచార్య, సర్కారు వారి పాట, బీమ్లా నాయక్ వంటి సినిమాలు ముందే రిలీజ్ అయ్యాయి. వీటిలో కొన్ని బ్లాక్ బస్టర్ కాక మరికొన్ని యావరేజ్, అట్టర్ ప్లాప్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ లో ఆగస్టు నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున సినిమాలు విడుదల కానున్నాయి. ఆ సినిమాల వివరాలు చూసుకుంటే.. ఈనెల మొదటి వారం బింబిసార, సీతారామమ్ రిలీజ్ కానున్నాయి. ఇక రెండో వారంలో మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2. ఆ తర్వాత ఆగస్టు 25వ తారీకు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన “లైగర్” రిలీజ్ కానుంది. వీటితోపాటు మరికొన్ని ఆరేడు చిన్న సినిమాలు.. ఆగస్టులో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి.
మొత్తం మీద చూసుకుంటే ఈ ఏడాదిలో ఎక్కువగా ఆగస్టు నెలలోనే సినిమాలు విడుదలవుతున్నట్లు తెలుస్తుంది. మరి వీటిలో ఎన్ని విజయం సాధిస్తాయో చూడాలి. చాలావరకు ఇండస్ట్రీలో ప్రతిష్టాత్మకంగా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు.. వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కానున్నాయట. మరికొన్ని సినిమాలు దసరా పండుగకు సందడి చేయనున్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఆగస్టు నెలలోనే భారీగా బాక్సాఫీస్ వద్ద సినిమాలు విడుదలవుతున్నాయి. ఈ ఏడాది వేసవి సీజన్ కంటే ఎక్కువగా ప్రస్తుతం ఆగస్టు నెలలో బాక్సాఫీస్ వద్ద వ్యాపారం జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.