ఏప్రిల్‌ 26న ఎండ్‌ గేమ్

అవెంజర్స్‌ టీమ్‌ చేసే పోరాట నేపథ్యంలో అవెంజర్స్‌ సినిమాలు రూపొందాయి. ప్రపంచ వ్యాప్తంగా అవెంజర్స్‌ సిరీస్‌కు భారీ క్రేజ్‌ నెలకొంది. పిల్లల నుంచి పెద్దల వరకు చూసేలా యూనివర్సల్‌ కాన్సెప్ట్స్‌తో రూపొందుతుండటంతో ప్రపంచ ప్రేక్షకులంతా ఈ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే ‘అవెంజర్స్‌ సిరీస్‌లో వస్తున్న నాలుగో భాగం ‘అవెంజర్స్‌-4 ఎండ్‌ గేమ్.’‌..

భూమిని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు షాడోస్‌ తానోస్‌ బృందం ప్రయత్నిస్తుంటుంది. దాన్ని ఎదుర్కొనేందుకు సూపర్‌ పవర్‌తో సూపర్ హీరోస్ ఏం చేశారు అనే కామిక్ కథతో యాక్షన్‌ అడ్వెంచర్‌, ఫాంటసీ, సైన్స్‌ ఫిక్షన్‌గా ఈ మూవీ రూపొందుతుంది. ఆంటోని రుస్సో దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఏప్రిల్‌ 26న సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతంలో వచ్చిన మూడు సిరీస్‌లాగే ఈ నాలుగో సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.