Avika Gor: అవికా గోర్.. ఈ బ్యూటీ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `బాలికా వధు`(తెలుగులో చిన్నరి పెళ్ళికూతురు) సీరియర్ ద్వారా దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అవకా గోర్.. `ఉయ్యాల జంపాల` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అవికాకు మరిన్ని ఆఫర్ల వచ్చాయి.
లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్త మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా ఇలా వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, ఇవేవి ఆమెకు సక్సెస్ అందించలేకపోయాయి. ఇదే క్రమంలోనే థైరాయిడ్ కారణంగా కాస్త బరువు పెరిగిన అవికా.. కొన్నాళ్లు తెరపై కనిపించలేదు.
అయితే మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి బక్కచిక్కిన ఈ బ్యూటీ.. ఇటీవల `నెట్`, `బ్రో` సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. అలాగే నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన `థ్యాంక్యూ` మూవీలో అవికా ఓ హీరోయిన్గా నటించింది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా అవికా గోర్ డిఫరెంట్ మేకోవర్‌తో హాలీవుడ్ బ్యూటీలా మారిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు అవికాను గుర్తు పట్టలేనంతగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.