రాముడు గురించి రాముడేమన్నారంటే…

Share

హిందువుల ఆరాధ్య దైవం శ్రీ రాముడు జన్మభూమి అయోధ్య లో ప్రధాని మోడీ చేతుల మీదగా రామమందిర శంకుస్థాపన రాయి కి పునాది పడటంతో దేశవ్యాప్తంగా తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ఆగస్టు 5వ తారీకు భారతీయ చరిత్రలో ఒక చరిత్రాత్మకమైన ఘట్టం అయోధ్య సాక్షిగా చోటు చేసుకుందని ఈ కార్యక్రమం గురించి ప్రపంచమంతా చర్చించుకుంటూ ఉంది. రాముడి జన్మ స్థలంలో రామ మందిరానికి పునాది పడటంతో రామభక్తులు ఎంతగానో సంతోషిస్తున్నారు.

Arun Govil Reveals His Favourite 'Ramayan' Character Other Than ...ఇలాంటి తరుణంలో రామాయణాన్ని కళ్ళకి కట్టినట్లు చూపించిన రామాయణం సీరియల్ తారాగణం కూడా ఎంతగానో సంతోషించింది. రామాయణం సీరియల్ లో రాముడు, సీత, లక్ష్మణుడు పాత్రలో నటించిన అరుణ్ గోవిల్, దీపికా చిక్ లియా, సునీల్ లహరి తమ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా బయట ప్రపంచానికి పంచుకున్నారు. ముందుగా రామాయణం పాత్రలో రాముడి పాత్రలో నటించిన అరుణ్ గోవిల్.. ట్విట్టర్లో ఈ విధంగా స్పందించారు. “అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరగటం చరిత్ర లో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన రోజు” అని పేర్కొన్నారు.

ప్రపంచంలో రామ భక్తులందరి చిరకాల కల సాకారమైన రోజు మీ అందరికీ నా శుభాకాంక్షలు అంటూ రాముడు గురించి రాముడి పాత్ర చేసిన పాత్ర ధారి స్పందించారు. ఇక సీతాదేవి పాత్రలో నటించిన దీపికా చిఖాలియా …. “ఇది భారతీయులకు ఒక గొప్ప విజయం. దీపాలను వెలిగిస్తుంది రామనామ స్మరణ చేస్తూ ముందుకు పదండి అని” ట్విట్టర్లో స్పందించింది.

అదే రీతిలో లక్ష్మణుడి పాత్ర చేసిన సునీల్ లహరి “భారతీయ చరిత్రలో ఆగస్టు 5వ తారీకు చరిత్ర తిరగరాసిన రోజు. ఆగస్టు 15 అలాగే ఈ రోజు కూడా భారతీయులకు గుర్తుండిపోతుంది. 500 ఏళ్లనాటి సమస్య రామమందిరం కోసం వేసిన పునాది రాయి తో ముగిసింది. భారతీయులందరికీ శుభాకాంక్షలు” అంటూ శుభాలు తెలిపాడు. ఇదే రీతిలో మరికొంతమంది నటీనటులు కూడా అయోధ్యలో రామమందిరాన్ని కి పునాదిరాయి పడటంతో సంతోషం వ్యక్తం చేశారు.


Share

Related posts

Sampoornesh Babu: సంపూర్ణేష్ బాబు హీరోగా “క్యాలీఫ్లవర్”..!!

bharani jella

Allu Arjun: అల్లు అర్జున్ కు ఉన్న మొత్తం ఆస్తి కలిపితే ఎంతో తెలుసా??

Naina

జగన్ మాదిరిగానే ఆ విషయంలో అలర్ట్ అవుతున్న కేసీఆర్..??

sekhar