BA Raju: బీఏ రాజు కుమారుడి “సూపర్ హిట్” డెసిషన్..!

BA Raju: Son Super Hit Decision
Share

BA Raju: తెలుగు సినీ పరిశ్రమTragedy in Tollywood: తెలుగు చిత్ర సీమలో మరో విషాదం..! ప్రముఖ సంగీత దర్శకుడు కేఎస్ చంద్రశేఖర్ కన్నుమూత..!!లో హీరోలు, నిర్మాతలు, దర్శకులు అందరికీ సుపరిచితమైన పేరు బీఏ రాజు.. ఈయన రెండు రోజుల కిందట మరణించిన సంగతి తెలిసిందే.. సూపర్ స్టార్ కృష్ణకి పెద్ద అభిమానిగా నెమ్మదిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన బీఏ రాజు సినీ జర్నలిస్టుగా మారారు.. అలా కొనసాగుతూ “సూపర్ హిట్” మ్యాగజిన్ ద్వారా అందరికీ చేరువయ్యారు. చాలా మంది హీరోలకు, కొన్ని నిర్మాణ సంస్థలకు పీఆర్వోగా పని చేసారు. మహేష్ బాబుకి అత్యంత దగ్గర వ్యక్తిగా మసలుకున్నారు. ఈ బీఏ రాజు భార్య బి. జయ గత ఏడాది మరణించారు. తాజాగా రాజు కూడా మరణించడంతో వారి కుమారుడు బి. శివ కుమార్ తండ్రి వారసత్వాన్ని స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. “సూపర్ హిట్” మ్యాగజిన్ తో పాటూ.. ఇండస్ట్రీ హిట్ వెబ్సైటు ని కూడా కొనసాగిస్తానని ఈరోజు ట్వీట్ చేశారు.

BA Raju: Son Super Hit Decision
BA Raju: Son Super Hit Decision

BA Raju:  ప్రముఖుల బాసట..!

ఇక బీఏ రాజు మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో అనేక మంది ప్రముఖులు ఆ కుటుంబానికి బాసటగా నిలవడానికి సిద్ధపడుతున్నారు. హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, సహా చాలా మంది రాజు కుమారుడు శివకుమార్ కి ఫోన్ చేసి ఓదార్చారు. మహేష్ బాబు ఒక అడుగు ముందుకేసి “బీఏ రాజు గారి కుమారుడు శివకుమార్ బాధ్యత నాది” అంటూ ట్వీట్ చేశారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, అల్లు అరవింద్ తదితరులు కూడా రాజు మృతి పట్ల సంతాపం తెలిపి, శివకుమార్ ని ఓదార్చారు. ఆ కుటుంబానికి బాసటగా నిలిచేందుకు పరిశ్రమ మొత్తం సిద్ధంగా ఉంది అంటూ పెద్దలు ప్రకటించడంతో రాజులో మంచితనం తెలుస్తుందని ఆయన అభిమానులు చెప్పుకుంటున్నారు..


Share

Related posts

అబ్బాయిలు పక్కింటి అమ్మాయితోనైనా అడ్జస్ట్ అవుతారు కానీ అమ్మాయిలకు మాత్రం సిక్స్ ప్యాక్ ఉన్నవాడు కావాలి.. పూరీ షాకింగ్ కామెంట్స్

Varun G

Pawan Kalyan: డిఫరెంట్ లుక్ లో పవన్ కళ్యాణ్..??

sekhar

బిగ్ బాస్ 4: నేనే చెత్త పర్ఫార్మర్: అమ్మ రాజశేఖర్!

Teja